జేసీకి స‌భా వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చిన బాబు

Update: 2017-06-09 14:20 GMT
తెలుగుదేశం పార్టీ ఎంపీ - త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త జేసీ దివాకరరెడ్డి మ‌రోమారు అదే రీతిలో కామెంట్లు చేశారు. అది కూడా ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇబ్బంది క‌లిగించే కామెంట్ల‌ను ఆయ‌న స‌మ‌క్షంలోనే కావ‌డం ఆస‌క్తిక‌రం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయిన సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ హార్టీ కల్చర్ లో దేశంలోనే అనంతపురం జిల్లా బెస్ట్ అండ్ ఫస్ట్ అని అన్నారు.

ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి గురించి - పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. 2019లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే జేసీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేశారు. పోలవరం పూర్తి చేసి త‌మ‌కు నీళ్లివ్వడం వ‌ల్ల సీమ రైతులు వంద అమరావతులను నిర్మిస్తారని అన్నారు. కోససీమ కోససీమ అంటారు కానీ అంతకంటే అనంతపురంలో హార్టి కల్చర్ లో ఎంతో ముందున్న జిల్లా అనంతపురం అని జేసీ వ్యాఖ్యానించారు. అయితే సూట్ పేరుతో రైతులు దోపిడీకి గుర‌వుతున్నారని ఆరోపించారు. ఈ సూట్ పద్ధతిని నిర్మూలిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

అనంత‌రం సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ ఈ రోజు నుంచి సూట్ తీసుకునే వాళ్లు ఈ రాష్ట్రంలో ఉండటానికి వీళ్లేద‌ని తేల్చిచెప్పారు. ఎవరైనా సరే సూట్ వసూలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. వేదిక పై నుంచే ఆక్ష్న ఎస్పీ, కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. సూట్, కమిషన్లు కొనసాగితే మీకు కూడా మంచిది కాదని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఎడారిగా మారడానికి వీలు లేదని, రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తాను తీసుకుంటాను అని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా ఉద్యాన వన పంటలకు కేంద్రంగా మారాలన్నారు. పట్టిసీమ ఏడిది కాలంలో పూర్తి చేస్తామంటే ఎవరూ నమ్మలేదని చంద్రబాబు అన్నారు. కొందరైతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారని అయిన‌ప్ప‌టికీ పట్టిసీమ ఏడాదిలోగా పూర్తయ్యిందని అన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటామన్న వారు మాత్రం నిస్సిగ్గుగా రాజకీయాలలో కొనసాగుతున్నారని మండిప‌డ్డారు. ఇప్పడు పోలవరం నిర్మిస్తున్నామ‌ని,  ఎన్ని అడ్డంకులు ఎదురైనా, అవరోధాలు ఎదురైనా నిర్ణీత సమయంలో పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు చెప్పారు. ప‌రోక్షంగా అక్క‌డే నఉన్న ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కామెంట్ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News