ఏపీలో టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కంచుకోట. అయితే ఆ కంచుకోటను బద్దలు కొట్టాలని వైసీపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహరచనలు చేస్తోంది. ఇక్కడ సాక్ష్యత్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బరిలో నిలుస్తున్నారు. ‘కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి..’ అన్నట్లు వైసీపీ అధినేత చంద్రబాబు ఓటమికి మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. ఇన్నాళ్లు ఎదురులేకుండా కుప్పంలో గెలుస్తూ వస్తున్న చంద్రబాబుకు ఈసారి చెక్ పెట్టాలని జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారట...
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తాను అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు - అభివృద్ధే గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. అన్నదాత సుఖీభవ - మహిళలకు పసుపు-కుంకుమ - యువసేస్తం - ట్రాక్టర్ల పంపిణీ వంటి పథకాలను ప్రజలకు చేరవయ్యాయని ఇవే తనను గెలిస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. అయితే వైసీపీ మాత్రం సంక్షేమ పథకాల అమలులో ఏ చిన్నపొరపాటు జరిగిన ప్రజల్లోకి తీసుకెళుతూ ప్రజల మద్దతు తనవైపు తిప్పుకుంటోంది.
చంద్రబాబుపై 2014లో పోటీచేసిన చంద్రమౌళినే ఈసారి కూడా బరిలో నిలుపుతున్నారు. ఈయనకు ఇక్కడ కులం కార్డు కలిసి రానుంది. తన వర్గానికి చెందిన కులస్థులతో మంచి బాంధవ్యాలు చంద్రమౌళి కి ఉన్నాయి. అందుకు తగ్గటుగానే చంద్రమౌళి ప్రజల్లో కలిసిపోతూ తిరుగుతుంటారు. ఎక్కడా ఏ చిన్న పేరంటం ఉన్నా వెళుతూ కార్యకర్తలను, ప్రజలను కలుపుకొని పొతుంటారు. ఈ లక్షణంతోనే ఈసారి చంద్రబాబుపై గెలువాలని శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు.
2009 ఎన్నికల వరకు కుప్పంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజన అనంతరం మూడో స్థానానికి దిగజారింది. అలాగే కొత్తగా వచ్చిన జనసేన, బీజేపీ పార్టీలు నామమాత్రంగా బరిలో దిగుతుండటం వైసీపీ కలిసి రానుంది. వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తే చంద్రబాబుపై గెలువలేకపోయినా కనీసం ఆయన మోజార్టీ అయిన తగ్గించే అవకాశం మెరుగ్గా ఉంది. మచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించొచ్చు. ఈసారి గతంలో వచ్చిన మోజార్టీని తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఒకవేళ చంద్రబాబుకు మెజార్టీ తగ్గినా అది వైసీపీ కలిసొచ్చే అవకాశమే. ప్రజల మద్దతు చంద్రబాబుకు లేదని ప్రచారం చేసుకోవచ్చని వైసీపీ భావిస్తుంది.
ప్రస్తుతానికి వైసీపీ కుప్పంలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతుంది.. అదికాకపోతే కనీసం చంద్రబాబు మెజార్టీ కొంతమేరకైనా తగ్గించాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. అందుకు తగ్గట్టుగానే క్షేత్ర స్థాయిలో వైసీసీ శ్రేణులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్న వైసీపీ శ్రేణులు ఈసారి కుప్పంలో చంద్రబాబు గెలుపు అంత ఈజీ కాదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చూడాలి మరీ ఎన్నికల బరిలో ఎవరూ విజేతలుగా మిగులుతారో?.