గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్‌కు గంటల వ్యవధే ఉన్న నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన టీఆర్ఎస్ ఏకైక బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు తన విశ్వరూపం చూపారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బాబుకు ఏపీలో బోలేడు పని ఉందని పేర్కొంటూ ఊడ్చేందుకు ఎన్నో రోడ్లున్నాయని ఎద్దేవా చేశారు. బాబుకు హైదరాబాదీలు ఓటు వేయరని కామెంట్ చేస్తూ ఆయన సతీమణి భువనేశ్వరి కూడా తనకే ఓటువేస్తారని ధీమా వ్యక్తం చేవారు. దీనిపై చంద్రబాబు మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరును ఆక్షేపించారు. హైదరాబాద్ సహా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతాన్ని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరించలేకపోతున్నారని అన్నారు. గ్రేటర్ లో టీడీపీకి ఉన్న ఆదరణను చూసి అసహనంతో స్థాయి మరిచి కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. రెండ్రోజుల క్రితం తనకు హైదరాబాద్ ఏం పని అంటూ విమర్శించిన కేసీఆర్...అనంతరం తన కుటుంబ సభ్యుల గురించి అబద్దాలు ప్రచారం చేశారంటే ఆయన అసహనం అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
గ్రేటర్‌లో గెలుపు మనదేనని పార్టీ నాయకులతో చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు సహా బీజేపీ నేతలు సమన్వయం చేసుకొని రెండ్రోజులు పనిచేస్తే చాలు గ్రేటర్ గెలుపును ఆపలేరని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండి అధికార టీఆర్ఎస్ చర్యలను ఎండగట్టాలని కోరారు.