అడిగామంటే అడిగినట్లుగా నాలుగు ప్రశ్నలు అడగటం.. వారు చెప్పే సమాధానం వినకుండా.. తనకు కావాల్సిన సమాధానం కోసం ఆరాటంగా ఎదురుచూసే తత్వం ఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ఎక్కువే. కాకుంటే అది గతంగా మారింది. విపక్ష నేతగా ఉన్న సమయంలో ఎవరితోనైనా మాట్లాడే సమయంలో.. వారి నోటి నుంచి ప్రభుత్వాన్ని విమర్శించే మాటలు వారి నోటి నుంచి రావాలన్న తపన ఎక్కువగా కనిపించేది.
పదేళ్ల తర్వాత పవర్ లోకి వచ్చిన బాబు తీరు ఈ మధ్య కాస్త మారింది. తన సహజ ధోరణికి భిన్నంగా కులాసాగా మాట్లాడుతున్నారు. పంచ్ జోకులు వేస్తున్నారు. తన మాటలతో నవ్వులు పువ్వులు పూయిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు బాబులో గతంలో పెద్దగా కనిపించేవి కావు. మారిన బాబు ధోరణి ఈ మధ్యన స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఒక కార్పెంటర్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా అతని వ్యక్తిగత వివరాలు అడుగుతూ.. నీ భార్య ఎంతవరకు చదువుకుందని ప్రశ్నించారు. డిగ్రీ వరకూ చదివిందని చెప్పిన అతని సమాధానంతో.. ‘‘నీ భార్య ఎక్కువ చదివిందన్న అసూయ ఉందా?’’ అని ప్రశ్నించారు.
తనకు అలాంటిదేమీ లేదని సదరు కార్పెంటర్ బదులిచ్చారు. ఇక్కడితో వదలని బాబు.. అతన్ని మరిన్ని ప్రశ్నలు వేస్తూ.. మీ ఇద్దరిలో ఎవరి మాట ఎవరు వింటారు? అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన సదరు కార్పెంటర్.. ఒకరి మాట ఒకరు వింటామని చెప్పాడు. దీనికి స్పందించిన చంద్రబాబు.. తెలివిగా సమాధానం చెబుతున్నావ్. అవున్లే.. నిజం చెబితే ఇంట్లో ఫుడ్ దొరకదు కదా? అంటూ జోకారు. ఇంతకీ.. ఇలాంటి అనుభవం బాబుకు స్వానుభవం కాదు కదా..?