ఏపీ సీఎం చంద్రబాబు ఉగాది రోజున బంధుమిత్రులకు భారీ పార్టీ ఇవ్వనున్నారు. తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆయన ఈ పార్టీ ఇస్తున్నారు. ఉగాది రోజు సాయంత్రం ఈ పార్టీ ఉంటుంది. విజయవాడలోని ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పార్టీ ఏర్పాటు చేశారు. బంధువులు - మిత్రులను పెద్ద సంఖ్యలో ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానాలు అందించే కార్యక్రమం దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఆహ్వానితుల్లో మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు - ఐఏఎస్ అధికారులు హాజరుకానున్నారు.
ఉగాది రోజున సాయంత్రం 6 నుంచి 11 వరకు పార్టీ కొనసాగుతుందని చంద్రబాబు సన్నిహితులు వెల్లడించారు. కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, దేవాన్షు మొదటి పుట్టిన రోజు ఇప్పటికే అయిపోయింది. కుటుంబసభ్యులు - అత్యంత సన్నిహితుల మధ్య వేడుకలు జరిపారు. ఇప్పుడు ఉగాది రోజున మరోసారి భారీ పార్టీతో మిగతావారిని ఆమ్వానించి వేడుకలు జరుపుతున్నారు.
ఇంతకుముందు మనువడి పుట్టిన రోజు నాడు చంద్రబాబు - బాలయ్యల కుటుంబాలు తిరుమలలో ప్రత్యేక పూజలు జరిపాయి. ఇప్పుడు భారీ ఎత్తున పార్టీ ఏర్పాటు చేసి చంద్రబాబు అందరితో సంతోషం పంచుకోనున్నారు.