సెంటు భూమి రేటుకే ఎకరాలు కట్టబెట్టేస్తున్న బాబు

Update: 2019-02-16 04:11 GMT
చంద్రబాబు భూపందేరాలు వివాదాస్పదమవుతున్నాయి. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి అయిదేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఆయన ఇష్టారాజ్య భూకేటాయింపులతో వివాదాస్పదమవుతున్నారు. ప్రయివేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెడుతున్నారని విపక్ష వైసీపీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు.
  
ప్రధానంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత మళ్లీ అధికారం అందుతుందా లేదా అన్న అనుమానాలు ఉండడంతో చంద్రబాబు పూర్తిగా బరితెగించారని.. తనకు కావాల్సిన సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
  
ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రానుండడంతో ఆ కోడ్ అమల్లోకి రాకముందే.. భూకేటాయింపులు చేయాలని చంద్రబాబు తొందరపడుతున్నారట. తాజాగా అకార్డ్ యూనివర్సటీకి విశాఖలో 120 ఎకరాలను కేవలం రూ.57 కోట్లకు అప్పగించారు చంద్రబాబు. యారాడలో 70 ఎకరాలు - సబ్బవరంలో 50 ఎకరాలు ఇందుకుగాను కేటాయించారు.
  
నిజానికి యారాడలో మార్కెట్ ధర ఎకరాకు రూ.14.5 కోట్లు ఉంది. కానీ, చంద్రబాబు ఎకరా కేవలం రూ.కోటికే కేటాయించారు. ఇక సబ్బవరంలో ఎకరా రూ.10 లక్షలకే ఇచ్చేశారు. అక్కడ మార్కెట్ రేటు ప్రకారం సెంటు భూమే రూ.5 లక్షల వరకు ఉంది.
  
అయితే, చంద్రబాబు తాను చేసిన పనుల సమర్థించుకోవడంలో మాత్రం ఏమాత్రం వెనుకాడడం లేదు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎడ్యుకేషనల్ హబ్‌ గా మార్చే క్రమంలో ప్రయివేటు యూనివర్సిటీలకు రాయితీలు ఇస్తున్నామని చెబుతున్నారు. అయితే.. కారు చౌకగా భూములు కేటాయించడం వెనుక చంద్రబాబు కుటుంబానికి భారీ లబ్ధి కలుగుతోందన్న ఆరోపనలు వస్తున్నాయి.



Tags:    

Similar News