జడ్జ్‌ లతో చంద్రబాబు భేటీ..? ఏం జరుగుతోంది..?

Update: 2019-01-23 10:47 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా సంచలనమే. ఒక్కసారి కమిట్‌ అయితే ఆయన మాట ఆయనే వినడు. ఏపీలో హైకోర్టుకు తాత్కాలిక భవనం ఏర్పాటు చేసిన దగ్గరనుంచి.. కోర్టు - దాని వ్యవహారాలు - నియామాకాల్లో ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. హైకోర్టు కోసం తాత్కాలిక భవనం ఏర్పాటు చేసినా కూడా చాలా న్యాయ సంస్థలు ఇంకా అమరావతికి తరలిరాలేదు. దీంతో.. వీటికి సంబంధించిన అప్‌ డేట్స్‌ కోసం ఢిల్లీ  చాలా బిజీగా ఉన్నారు చంద్రబాబు. మంగళవారం న్యాయమూర్తులతో ప్రత్యేకంగా భేటీలు నిర్వహించారు. అలాగే జస్టిస్ రమణతో దాదాపు గంటన్నర పాటు సమావేశం అయినట్టుగా సమాచారం.

బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటిని కూడగట్టచేందుకు ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు. దావోస్‌ వెళ్లాల్సి ఉన్నా దాన్ని క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఆ కార్యక్రమానికి లోకేష్‌ ని పంపించారు. ఇప్పుడు ఢిల్లీలోనే ఉండి అన్ని పక్షాల్ని ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా ఎటూ ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమణను  నూతన హైకోర్టు భవన ప్రారంభానికి ఆహ్వానించారని సమాచారం. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ను కూడా చంద్రబాబు కలిశారు. ఆయనను కూడా తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభానికి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. ఓటుకు నోటు కేసు విషయంలో న్యాయమూర్తుల సలహా కోసమే చంద్రబాబు అందర్ని కలుస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే ఒకవేళ మోదీ సర్కార్‌ ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రయత్నిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై కూడా న్యాయమూర్తులతో చర్చించారని అందుకే చంద్రాబబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారనే వార్తలు కూడా ఉన్నాయి.



Full View

Tags:    

Similar News