చంద్ర‌బాబు వ‌ద్ద ఇంకా అస్త్రాలున్నాయ‌ట‌!

Update: 2020-01-22 16:44 GMT
ఏపీ రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణను అడ్డుకోవ‌డానికి త‌మ వ‌ద్ద ఇంకా ఆయుధాలు ఉన్నాయ‌ని తెలుగుదేశం అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించుకున్నారు. అసెంబ్లీలో  ఆమోదం పొందిన వికేంద్రీక‌ర‌ణ బిల్లును మండ‌లిలో చ‌ర్చ‌కు రాకుండా అడ్డుకుంది తెలుగుదేశం పార్టీ. మండ‌లిలో తెలుగుదేశం పార్టీకి బ‌లం ఉన్న నేప‌థ్యంలో.. అక్క‌డ ఈ బిల్లు చ‌ర్చ‌కు రాలేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు విజ‌యానందంతో కనిపిస్తూ ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ బిల్లును అడ్డుకోవ‌డానికి త‌మ వ‌ద్ద ఇంకా అస్త్రాలున్నాయ‌ని ప్ర‌క‌టించుకున్నారు. ఆ అస్త్రాలు ఏమిటో ఆయ‌న చెప్ప‌లేదు కానీ.. అస్త్రాలున్నాయ‌ని మాత్రం ప్ర‌క‌టించుకున్నారు.

మండ‌లిలో ఈ బిల్లు ఆమోదం పొంద‌క‌పోయినా ఫ‌ర్వాలేదు అని, మూడు నెల‌ల త‌ర్వాత అయినా ప్ర‌భుత్వం త‌ను అనుకున్న‌ది చేస్తున్న‌ద‌ని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఏదైనా బిల్లును శాశ్వ‌తంగా అడ్డుకునే అధికారం మండ‌లికి ఉండ‌ని అంటున్నారు. భార‌త రాజ్యాంగ ప్ర‌కారం దిగువ స‌భ‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎగువ స‌భ అలంకార ప్రాయ‌మే కొన్ని సార్లు. ఇలాంటి నేప‌థ్యంలో .. మండ‌లి ఆమోదం లేక‌పోయినా ప్ర‌భుత్వం అనుకున్న వికేంద్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో.. మండ‌లిలో అడ్డుకోవ‌డం అనేది తాత్కాలిక‌మే అంటున్నారు.

అయితే చంద్ర‌బాబు నాయుడు మాత్రం త‌మ వ‌ద్ద ఇంకా అస్త్రాలున్నాయ‌ని అంటున్నారు. ఆ అస్త్రాలు ఏమిటో మాత్రం ఆయ‌న చెప్ప‌డం లేదు!


Tags:    

Similar News