వినేవాడు వెర్రివాడైతే.. విమానాన్ని గద్ద ఎత్తుకెళ్లిందని సామెత. విమానాన్ని గద్ద లాంటి ఒక పక్షి ఎలా ఎత్తుకెళ్తుంది అనే అంశం ఇక్కడ పరిగణలోకి రాదు.. ఎందుకంటే వినేవాడు వెర్రివాడు కాబట్టి. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇలాంటివే చాలానే చెబుతున్నారు. గతంలో పనిపైనా, పరిపాలనపైనా పూర్తి శ్రద్ధ వహించేవారు అని పేరున్న చంద్రబాబు.. 2014 ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అయ్యక పూర్తిగా మారిపోయారనే విమర్శ ఉంది. కానీ నేటి పరిస్థితి పూర్తిగా భిన్నం.. చాలా మారిపోయాయి, చంద్రబాబు మాటలతో, చేతలతో సహా!
సెల్ఫ్ డబ్బా వేసుకోవచ్చు కానీ, మరీ ఇంతలానా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో బాబు గారి మాటలు వింటుంటే! తాజాగా గురువారం మండలిలో మాట్లాడిన బాబు చెప్పిన మాటలు వింటే.. "వినేవాడు వెర్రివాడైతే.." సామెత సరిగ్గా సరిపోతుంది. ఇంతకూ బాబు మండలిలో ఏమన్నారంటే... తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన విషయాన్ని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అమెరికా పర్యటనలో చెప్పారని.. తెగ పొగిడారని.. మాక్కూడా మీలాంట్ నగరాలు ఉన్నాయని అమెరికా ప్రజలకు, నేతలకూ చెబుతూ.. దానికి హైదరాబాద్ ను ఉదాహరణగా చూపించారని అన్నారు. సరిగ్గా గమనిస్తే ఇక్కడే ఉంది విమానాన్ని గద్ద ఎత్తుకెళ్లిన సంగతి.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది 1995 సెప్టెంబరులో. ఇదే సమయంలో పీవీ నరసింహారావు ప్రధానిగా దిగిపోయింది 1996లో. అంటే చంద్రబాబు పదవిలోకి వచ్చిన 8 నెలల్లోనే హైదరాబాద్ ను విపరీతంగా అభివృద్ది చేశారని, ఆ విషయాన్ని అమెరికా పర్యటనలో ఉన్న (కాంగ్రెస్) ప్రధాని పీవీ ప్రశంసించారన్న మాట. అయితే ఇది విన్న తర్వాత 8 నెలల్లోనే హైదరాబాద్ ను అలా అభివృద్ధి చేసేశారన్న మాట అని కొంతమంది చెప్పుకుంటూ, భావిస్తూ ఉంటే.. మరి కొందరు మాత్రం వెర్రివాళ్ల లిస్టులో తాముండం అని చెబుతున్నారు!