చంద్రబాబుకు 'పెద్ద' కష్టమే వచ్చింది

Update: 2016-11-19 11:30 GMT
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ అంశంలో మొదటి నుంచి ఆచితూచి వ్యవహరించారు. మోడీ నిర్ణయం మంచిదే అయినా జనం కష్టాలు తీరిస్తేనే అది మంచి నిర్ణయం అవుతుందని తొలిరోజే స్పష్టం చేశారు. అనంతరం క్రమంగా వ్యతిరేకించడం ప్రారంభించారు. దీంతో మోడీ నుంచి కేసీఆర్ కు పిలుపు కూడా వచ్చింది.

అంతేకాదు... పెద్ద నోట్లను రద్దు చేయించి తన ప్రత్యర్థి జగన్ ను ఇరుకున పెట్టాలని చంద్రబాబు కలలు కన్నారు. జగన్ వద్ద భారీగా నగదు నిల్వలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో జగన్‌ ను ఆర్థికంగా దివాలా తీస్తే తన గెలుపు సులభం అవుతుందని చంద్రబాబు భావించారు. అయితే నోట్ల రద్దు తరువాత జగన్‌ లో ఎలాంటి మార్పూలేదని ఆయన ఏమీ కంగారు పడడం లేదని చంద్రబాబుకు సమాచారం అందిందట. దీంతో తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందని... తన బాణం తనకే తగిలేలా ఉందని చంద్రబాబు తెగ టెన్షన్ పడుతున్నారు.

ఇది చాలదన్నట్లు టీడీపీ నేతలే ఈ రెండున్నరేళ్ల పాలనలో ఇసుక - ఇతర కాంట్రాక్టులతో అడ్డగోలుగా సంపాదించుకున్నారు. అదంతా మార్చుకోవడం వీలుకాక వారు చంద్రబాబుపై మండిపడుతున్నారు. వారంతా చంద్రబాబునే నిందిస్తున్నారు. దీంతో అటు జగన్ ను దెబ్బకొట్టలేక... ప్రజల్లోనూ వ్యతిరేకత తెచ్చుకుని.. పార్టీలోనూ అంసతృప్తులు ఎదుర్కొంటూ చంద్రబాబు అన్నివైపుల నుంచి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News