ముస్లిం పోలీసులకు బాబు తోఫా

Update: 2015-07-17 03:56 GMT
పోలీసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరులోనే ఏపీ ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే.. పోలీసు శాఖకు చెందిన పలు నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో చంద్రబాబు పోటీ పడలేరని చెప్పాలి.

అయితే.. ఆ దిశగా అడుగులు వేయటం బాబు మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. తాజాగా గోదావరి పుష్కరాల సందర్భంగా వస్తున్న రంజాన్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలోని ముస్లిం పోలీసులకు ఏపీ సర్కారు మూడు రోజులు పండుగ సెలవులు ప్రకటించారు. గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహిస్తున్న ముస్లిం పోలీసులకు.. జూలై 17 నుంచి 19 తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో..రంజాన్ సందర్భంగా పుష్కర విధులు నిర్వహిస్తున్న ముస్లిం పోలీసులకు మూడు రోజుల సెలవు లభిస్తోంది. ముస్లిం పోలీసులకు తోఫా ప్రకటించిన ఏపీ సర్కారుకు ధీటుగా తెలంగాణ సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News