ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకంగా యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పిన డేటా చోరీ సందర్భంగా... గతంలో టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉన్నపళంగా హైదరాబాద్ ను వదిలేసి విజయవాడకు పరుగులు పెట్టేలా చేసిన ఓటుకు నోటు కేసు కూడా అందరికీ మరోమారు గుర్తుకు వస్తోంది. నాడు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విల్ స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలిస్తూ అప్పటి టీ టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కైపోయారు. ఆ సందర్భంగా తెలంగాణ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన వ్యాఖ్యలను వాయిస్ రికార్డులను కూడా సంపాదించింది. ఈ వ్యవహారం ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనన్న భయంతో కనీసం కూర్చోవడానికి సరిపడ కార్యాలయం కూడా లేకుండానే చంద్రబాబు విజయవాడకు మకాం మార్చారు. ఇప్పుడు డేటా చోరీపై నమోదైన కేసుపై మాట్లాడేందుకంటూ చంద్రబాబు మీడియా ముందుకు రాగా... నాటి ఓటుకు నోటు కేసు గురించిన ఓ ప్రశ్న బాణంలా దూసుకువచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతానంటూ మైకందుకున్న చంద్రబాబు తనదైన శైలిలో నాలిక మడత పెట్టేశారు.
అసలు ఓటుకు నోటుపై చంద్రబాబుకు ఎదురైన ప్రశ్న ఏమిటి? ఆయన చెప్పిన సమాధానం ఏమిటన్న విషయానికి వస్తే... నేటి మధ్యాహ్నం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబుకు ఓ ప్రశ్నను సంధించారు. *ఓటుకు నోటు కేసులో మీరు ఇరుక్కున్నప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ విఫలమయింది. తాజాగా ఐటీ గ్రిడ్స్ సంస్థ వ్యవహారాన్ని సైతం పసిగట్టలేకపోయింది. టీడీపీ నుంచి మీరు తప్పా ఎవ్వరూ ఈ వ్యవహారంలో గట్టిగా ఎందుకు మాట్లాడటం లేదు?* అంటూ ఆ విలేకరి ప్రశ్నించారు. చంద్రబాబును పెద్దగా ఇబ్బంది పెట్టే ప్రశ్న కాకున్నా.... ఓటుకు నోటు అనగానే చంద్రబాబు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి ఉంటుంది కదా. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తానంటూ తలూపిన చంద్రబాబు.... తనదైన శైలి తెలివిని వినియోగించి ఆ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండానే సమాధానం ఇచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చారు.
ఈ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇలా సాగింది. *కాదమ్మా.. నేనేం అంటానంటే అప్పుడు(ఓటుకు నోటు కేసులో) కూడా ఏముంది? ఏంటి కేసులని వీళ్లు బెదిరించేది? ఎవరిని బెదిరిస్తారు? ఎన్నికలు వస్తుంటాయి. అలాంటప్పుడు కేడర్లు - లీడర్లు పది రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అలాంటివాటికి నాకు ఏం సంబంధం? మీకు(జర్నలిస్టులకు) తెలియదా ప్రజాస్వామ్యం అంటే? కొందరు నగదును సేకరిస్తారు. మరికొందరు ఖర్చుచేస్తారు. కేసీఆర్ ఓ పార్టీ అధ్యక్షుడు కాదా? ఆయనకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి?’ అంటూ చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. అయినా ప్రశ్నకు ఇదేమీ సమాధానమండీ అంటూ మీడియా ప్రతినిధులు బుర్రలు గోక్కోవడం కనిపించింది. చంద్రబాబు సమాధానాలు అలానే ఉంటాయి మరి.