ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న పరిణామాలకు మాటల తీవ్రతను పెంచటం తప్పించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన అనూహ్య ఘటన.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై దాడి చేయటం.. ఈ సందర్భంగా కంటికి తీవ్ర గాయం కావటం తెలిసిందే.
ఈ ఉదంతంపై విజయవాడ పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు.. దాడికి పాల్పడిన వైసీపీ నేతల్ని రక్షించేలా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన చెన్నుపాటి గాంధీ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన్ను పరామర్శించిన చంద్రబాబు.. మీడియాతో మాట్లాడుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే వదిలి పెట్టేది లేదన్నారు. ఓడిపోతామనే పిరికితనంతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కన్ను పొడవటం చాలా దుర్మార్గమన్న ఆయన.. ఈ ఘటనలో బాధ్యులకు శిక్ష పడే వరకు న్యాయపోరాటం చేస్తామన్నారు.
గతంలో తమ పార్టీ నేత పట్టాభిపై దాడి చేశారని.. ఆ రోజే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు కదా? అని ప్రశ్నించారు. 'ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చేసిన పని ఇది. మీ కుటుంబాలకు ఇదే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి.
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపైనే టీడీపీ కార్యకర్తలు పోరాడుతుంటారు. మాకు సొంత ఎజెండాలు లేవు. వైసీపీ ఆరాచకాలపై ప్రజల్లో చైతన్యం ప్రారంభమైంది' అంటూ వ్యాఖ్యానించారు.
చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి ఎమోషన్ లో జరిగిందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారన్న చంద్రబాబు.. పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మొత్తంగా చూస్తే.. పార్టీ నేతలపై జరుగుతున్న వరుస దాడులపై ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు.. పార్టీ క్యాడర్ కు తాను అండగా ఉంటానన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ఈ వయసులో ఇలాంటివి చంద్రబాబుకు కష్టంతో కూడుకున్నవని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.