గగనతలంలో గందరగోళం...అది కూడా పసిఫిక్ మహాసముద్రంపై విమానంలో ఉండగా...

Update: 2021-05-02 10:30 GMT
హావాయి వెళ్తున్న డెల్టా ఫ్లైట్ సరిగ్గా పసిఫిక్ మహాసముద్రం గగనతలం పై వెళుతోంది. విమానంలోని ప్రయాణికుల్లో కొందరు నిద్రపోతున్నారు. మరికొందరు సెల్ ఫోన్ చూస్తూ గడుపుతుండగా, ఇంకొందరు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. ఆ సమయంలో విమానం లో మొదలైంది అసలైన గడబిడ. ఎయిర్ హోస్టర్స్ ఇద్దరు ఆ సమయంలో విమానంలో అటూ ఇటూ తిరుగుతున్నారు. వారి ముఖాల్లో గందరగోళం కనిపించింది. వారిని చూసిన ప్రయాణికులు విమానానికి ఏదో జరుగుతోందని, ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు.

ఆ గందరగోళ వాతావరణానికి అప్పటివరకు నిద్రపోతున్న కొంత మంది ప్రయాణికులు బిత్తరపోయి లేచి కూర్చున్నారు. ఉన్నట్టుండి లేవడంతో అక్కడ అసలేం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. ఆ  సమయంలో ఎయిర్ హోస్టర్స్ ప్రయాణికులను ఉద్దేశించి ' విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా?' అని ప్రశ్నించారు. అంత లోగానే    విమానంలో అప్పుడే పుట్టిన పసికందు ఏడుపు బిగ్గరగా వినిపించింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులంతా బిత్తర పోయారు.

దీంతో ఎయిర్ హోస్టర్స్ చెప్పిన  విషయం తెలుసుకొని ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. విమానంలో ఓ నిండు గర్భిణి అప్పుడే ప్రసవించినట్లు వాళ్ళు చెప్పారు.

హావాయి వెళ్తున్న ఓ విమానంలో ఓ నిండు గర్భిణీ ప్రయాణిస్తోంది. విమానం  పసిఫిక్ మహా సముద్రం పై వెళుతున్న సమయంలో ఆ గర్భిణికి ఉన్నట్టుండి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఎయిర్ హోస్టర్స్  విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారేమోనని తెలుసుకునే ప్రయత్నంలో ఉండగానే ఆ గర్భిణికి సుఖప్రసవం జరిగింది.  తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఇదంతా  విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు వీడియో తీసి టిక్ టాక్ చేయడంతో ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలిసింది. ఈ ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
Tags:    

Similar News