చరితారెడ్డి డెడ్ బాడీ హైదరాబాద్ కు వచ్చింది!

Update: 2020-01-05 10:48 GMT
కొద్దిరోజుల క్రితం తన తప్పేమీ లేకున్నా.. మరో వాహన డ్రైవర్ తప్పునకు భారీ ప్రమాదానికి లోనైన హైదరాబాదీ అమ్మాయి చరితారెడ్డి అమెరికాలో మరణించటం తెలిసిందే. డిసెంబరు 27న అమెరికాలోని మిచిగావ్ లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో దుర్మరణం పాలవ్వగా.. ఆమె డెడ్ బాడీని మైదరాబాద్ కు తీసుకొచ్చే ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది.

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ భార్య తరఫు బంధువైన చరితా రెడ్డి మృతదేహాన్నిఈ ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ప్రమాదంలో మరణించిన చరితారెడ్డికి చెందిన కొన్ని అవయువాల్ని రెండు రోజుల క్రితం అమెరికాలో దానం చేసే ప్రక్రియ పూర్తి చేశారు. ఆమె కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు.. ఆమె డెడ్ బాడీని చూసినంతనే దు:ఖం పొంగి పొర్లింది.

నేరెడ్ మెట్ లోని రేణుకా నగర్ కు ఆమెను తీసుకొచ్చారు. బంధు మిత్రులు ఆమెను కడసారి చూసేందుకు వచ్చారు. స్థానిక శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చరితారెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు వచ్చారు. చరితారెడ్డి మృతదేహాం కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన వారంతా.. ఆమెను చూసి శోకసంద్రంలో మునిగిపోయారు.


Tags:    

Similar News