మీటూ’.. సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పదం.. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ , దక్షిణాది దర్శకులు, నటులు ఈ మీటూ వివాదంలో చిక్కుకుపోయారు. ఇది రాజకీయ, క్రీడా రంగాలకు కూడా పాకింది. ఫలానా ప్రముఖుడు ఫలానా రోజు తమను వేధించాడని ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు సంచలన విషయాలు వెల్లడిస్తూ బాంబు పేలుస్తున్నారు. తాజాగా ఇదే ‘మీటూ’ ఆయుధాన్ని ఉపయోగించి తమిళనాడులో ఓ అమాయకపు ప్రైవేటు ఉద్యోగిని దోచుకోవడం కలకలం రేపింది.
చెన్నైలోని ఆరంబాక్కంకు చెందిన కాళీ చరణ్ (43) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 43 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. చాలా సంబంధాలు చూస్తూ విసిగిపోయాడు. ఈ మధ్య మాట్రిమోనీ డాట్ కాంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. అందులో ఒక అమ్మాయి ఫొటో చూసి ముచ్చటపడి సంప్రదించాడు. బుధవారం ఒక అమ్మాయి ఫోన్ చేసి తాను బెంగళూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నానని, నేరుగా కలవాలని అనుకుంటున్నానని చెప్పిలోని ఓ షాపింగ్ మాల్ కు రమ్మింది.
ఆ తర్వాత అడ్రస్ లు మార్చుతూ చివరకు చెన్నైకు శివారులోని పొన్నమ్మాళ్ వీధిలోని ఒక ప్రైవేటు అతిథి గృహానికి రమ్మంది. అక్కడికి వచ్చాక ఒక అమ్మాయి వచ్చి లోపలికి తీసుకెళ్లింది. లోపల ముగ్గురు వ్యక్తులు తాము పోలీసులం అని.. మీ పరువు పోకుండా ఇక్కడ ప్లాన్ చేశామని.. మీటూలో మీ పేరు ఒక అమ్మాయి ప్రస్తావించిందని చెప్పి కాళీ చరణ్ వద్ద ఉన్న బంగారం వస్తువులు - ఐఫోన్ - రెండు ఏటీఎం కార్డులు వాటి పిన్ నంబర్లను కొట్టి తీసుకున్నారు. ఈ సంఘటనతో బిత్తరపోయిన కాళీచరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతిథిగృహంలోని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.