దుబ్బాక ఉప ఎన్నిక ముందర అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇది ఊహించని షాక్ గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దుబ్బాకకు చెందిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవ్వడం సంచలనంగా మారింది.
కాసేపట్లోనే చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్టు తెలిసింది. ఇక ఈ అనూహ్య పరిణామం.. పెద్ద నేత కాంగ్రెస్ లో చేరడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా టీఆర్ఎస్ టికెట్ పై బోలెడు ఆశలు పెంచుకున్న చెరుకు శ్రీనివాసరెడ్డి ఆ టికెట్ దక్కదని తెలియడంతో భంగపడ్డట్టు సమాచారం. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టీఆర్ఎస్ టికెట్ ఖాయమైనట్టు సమాచారం. అందుకే శ్రీనివాసరెడ్డి అలిగి ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పెద్దల టికెట్ హామీ మేరకు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని స్థానిక ద్వారా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఆయన చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం గమనార్హం.
కాగా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి ముత్యంరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందర టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఆయన కుమారుడు కాంగ్రెస్ బాట పడుతున్నారు.