రోజురోజుకూ మనిషి జీవన కాలం సగటు తగ్గుతూ వస్తోంది. కరోనా పుణ్యమా? అని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వారు ఎన్ని రోజుల వరకు ఉంటారో చెప్పలేని దీన పరిస్థితి. కాగా ఓ వృద్ధుడు మాత్రం వందేళ్లకు పైగా ఉన్నా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాకుండా మరో మూడేళ్లు ఆరోగ్యంగా ఉంటానని చెబుతున్నాడు. మరి ఆయన ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా?
ఆస్ట్రేలియాకు చెందిన డెక్స్ టర్ క్రూగర్ క్వీన్ ల్యాండ్ లో నివసిస్తారు. ఈయన ఓ పశువుల ఫారాన్ని నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆయన వయస్సు 111 ఏళ్ల 124 రోజులు. అయినా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. మరో మూడేళ్ల పాటు ఆరోగ్యంగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తన పని తాను చాలా సులభంగా చేసుకుంటున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
తన ఆరోగ్యం రహస్యం ఏంటో ఆ పెద్దాయన బయటపెట్టారు. ఊహ తెలిసినప్పటి నుంచి కోడి మెదడును ఆహారంలో భాగం చేసుకున్నానని చెబుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తింటున్నానని తెలిపారు. దాని వల్లే తాను ఇంత ఆరోగ్యంగా ఉన్నానని వివరించారు. మరో మూడేళ్లు ఆరోగ్యంగా ఉండి ఎలాగైనా రికార్డు సాధిస్తానని ఆయన తెలిపారు.
ఈ పెద్దాయన కోడి మెదడు ఆహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నిజానికి కోడి మెదడుకు ఆయువును పెంచే గుణం ఉందా? అని అందరూ ఆలోచనలో పడ్డారు. తాను ఊహ తెలిసినప్పటి నుంచి అంటున్నారు కాబట్టి నిజమేనేమో అని అభిప్రాయపడుతున్నారు.