తెలివితేటలు ఎన్ని ఉన్నా.. టైమ్లీగా రియాక్ట్ కావటానికి మించింది ఏం ఉండదు. ఊహించని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజానీకానికి తమ మీదున్న నమ్మకంతో ఊరట కలిగించే కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీసా దేవుడిగా పేరుప్రఖ్యాతులున్న హైదరాబాద్ శివారులోని చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల కాలంలో అమెరికాలో పెరిగిన జాతివివక్ష దాడులతో తెలుగువాడైన శ్రీనివాస్ కూఛిబొట్ల మృతి చెందటం.. మరికొందరు భారతీయులు బాధితులుగా మారిన వేళ.. అమెరికాలో తమ వాళ్లు ఉన్న వారంతా తీవ్ర అలజడికి గురి అవుతున్నారు. తమ వారి యోగక్షేమాలపై దిగులు చెందుతున్నారు. ఇలాంటి వేళ.. చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు.. రక్షా కవచం పేరుతో ఒకకార్యక్రమాన్నిషురూ చేస్తున్నారు.
వీసాల దేవుడిగా పేరున్న చిలుకూరి టెంపుల్ లో.. అమెరికాలోని తమ వారు క్షేమంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించి.. ఈ సురక్షా కవచాల్ని చేతికి కట్టుకుంటారు. స్వామి వారి ఆశీస్సులతో అయినవారు క్షేమంగా ఉంటారన్న మాటను ఆలయ ఆర్చకులు చెబుతున్నారు. 1990లలో అమెరికాకు వెళ్లాలని భావించేవారంతా ఈ స్వామి వారి దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయటం.. చాలామందికి అమెరికా వీసాలు ఓకే కావటంతో.. చిలుకూరి బాలాజీ టెంపుల్ కు వీసా దేవుడిగా పేరు వచ్చింది. తాజాగా.. అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలతో.. ఈ సరికొత్త ప్రచారం మొదలైనట్లు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/