భారత్- చైనా సరిహద్దు వెంబడి డ్రాగన్ అక్రమంగా ఓ గ్రామాన్ని నిర్మించిందని అమెరికా భద్రతా విభాగం పెంటగాన్ వెల్లడించింది. ఈమేరకు ఓ నివేదికను అమెరికా రక్షణ శాఖకు అందించింది. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చ నడిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి నిర్మించిన ఈ గ్రామానికి సంబంధించి భారత్ తొలుత ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ దీనిపై ఇండియన్ ఆర్మీ వర్గాలు స్పందించాయి. చైనా నిర్మించిన గ్రామం పూర్తిస్థాయిలో వారి భూభాగానికి చెందిందేనని వెల్లడించాయి. ఆ ప్రాంతంలో ఇప్పటికే చైనా అనేక నిర్మాణాలు చేపట్టినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతం గతంలోనే చైనా ఆక్రమణలోకి వెళ్లిందని చెప్పుకొచ్చాయి.
చైనా నిర్మించిన గ్రామం.. సరిహద్దుల్లో ఉండే అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సుబాన్ సిరి అనే జిల్లాకు చెందిందని భారత సైన్యం పేర్కొంది. 1959లో అసోం రైఫిల్స్ ను పీఎల్ఏ ఆక్రమించుకుందని తెలిపింది. పైగా అప్పటినుంచి ఆ ప్రాంతం అంతా చైనా అధీనంలో ఉంటోందని వెల్లడించింది. అక్కడ గతంలో అసోం రైఫిల్స్ ఉండే ఫార్వర్డ్ పోస్టులను ఆక్రమించుకున్న విషయాన్ని గుర్తు చేసింది. ఆ తరువాత ఆ ప్రాంతంలో చైనా దళాలు అక్కడే ఉంటున్నట్లు స్పష్టం చేసింది. 2020లోనే ఈ గ్రామం నిర్మాణం చేపట్టినట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. అంతేకాకుండా వంద ఇళ్ల వరకు నిర్మించినట్లు ప్రస్తావించింది. ఇందుకు ఆధారాలుగా శాటిలైట్ తీసిన కొన్ని చిత్రాలను ప్రసారం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ కు చాలా దగ్గరగా ఉంటుందని పేర్కొంది. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన పెంటగాన్ తన నివేదికలో కూడా పేర్కొంది. దీనిపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. భారతదేశానికి చెందిన భూమి నుంచి ఒక్క అంగుళం కూడా చైనాకు దక్కనిచ్చేది లేదని ప్రధాని మోదీ అన్నారని ఆయన గుర్తు చేశారు. దీనిపై కౌంటర్ గా రాహుల్ స్పందించారు.
భారత్-చైన్ సరిహద్దుల్లో గతేడాది జూన్ లో గల్వాన్ లోయలో ఘర్షణలు చెలరేగాయి. వీటిపై ఇరు దేశాలు ఒక్కోలా స్పందించాయి. అప్పటినుంచి భారత భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నట్లు సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డ్రాగన్ చేష్టల వల్లే గల్వాన్ ఘర్షణు జరిగాయని భారత్ చెబుతోంది. కాగా భారత్ వైఖరి వల్లే తాము ఎల్ఏసీ వద్ద మోహించినట్లు డ్రాగన్ ఆర్మీ వర్గాలు చెబుతున్నాయని అమెరికా రక్షణ శాఖ ప్రస్తావించింది. కొంతకాలంగా చైనా రాజ్య కాంక్షతో సరిహద్దుల వద్ద అలజడులు సృష్టిస్తోంది. మిగతా దేశాలను సరాసరి వశం చేసుకుంటున్న డ్రాగన్.. భారత్ తో మాత్రం ఆచీ తూచీ వ్యవహరిస్తోంది. భారత్ తో కయ్యానికి కాలం దువ్వేందుకు సిద్ధంగా లేకున్నా.. వైఖరిలో మాత్రం ఇలాంటి భావాన్ని ప్రదర్శింస్తూ కవ్విస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే భారత్ కూడా ఓ వైపు ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు ఫార్వర్డ్ పోస్టుల వద్ద సైన్యాన్ని మోహరిస్తోంది. అంతేగాకుండా యుద్ధ సస్నదతకు కావాల్సిన సామాగ్రిని ఇప్పటికే సమకూర్చింది. అప్పుడుప్పుడు చైనాకు గట్టి సమాధానం ఇవ్వగలుగుతామని నిరూపించేందుకు భారత్ సైనిక చర్యలను కూడా చేపడుతోంది. చైనాకు వ్యతిరేకంగా ఉన్న దేశాల నుంచి సహాయ సహకారాలను అందిపుచ్చుకుంటూ ఇప్పటికే చాలా సార్లు యుద్ధ విన్యాసాలను చేపట్టింది.