దెబ్బకు డ్రాగన్ సైన్యం వణికిపోతోందంటే మన సైన్యం దెబ్బకు అనుకునేరు. కాదు మైనస్ డిగ్రీల నమోదవుతున్న చలి దెబ్బకు తట్టుకోలేక వణికిపోతున్నారట. తూర్పు లడ్డాఖ్ లో మన సైన్యాన్ని ఇబ్బంది పెట్టడానికి, మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా సైన్యం చేస్తున్న ప్రయత్నాలన్నీ అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు కావాలనే ఉద్రిక్తలను సృష్టిస్తు మన సైన్యాలను డ్రాగన్ ఎన్ని చికాకులకు గురిచేసిందో అందరు చూసిందే. అయితే ఇపుడదంతా చరిత్రగా మిగిలిపోయింది లేండి. కానీ చైనా సైన్యానికి అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది.
అదేమిటంటే చలికాలంలో మంచుకొండల్లో కాపలా కాయటంలో మనకున్నట్లుగా అనుభవం డ్రాగన్ సైన్యానికి లేదట. దాంతో ఇపుడు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. తూర్పు లడ్డాఖ్ లో చైనా సుమారు 60 వేల సైనికులను మోహరించింది. వీరితో పాటు పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకర్లు, మోర్టార్లు, హెలికాప్టర్లు, మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్లు కూడా ఏర్పాటు చేసుకుంది. అయితే ఎప్పుడైతే చలికాలం మొదలైందే ఇవన్నీ నిరుపయోగం అయిపోయాయట. ఎందుకంటే వీటిని ఉపయోగించటం చైనా సైనికులకు చేత కావటం లేదట.
విషయం ఏమిటంటే లడ్డాఖ్ ప్రాంతంలో కానీ సియాచిన్ పర్వతాలపైన శీతాకాలంలో మామూలు జనాలెవరు ఒక్క నిముషం కూడా ఉండలేరు. ఎందుకంటే 18 వేల అడుగులపైన మైనస్ 40 డిగ్రీల చలి రికార్డవుతుంది. మైనస్ డిగ్రీల చలిలో కాపలా కాయటం మన సైన్యానికి కొత్తకాదు. దశాబ్దాల పాటు మన సైన్యం ముందు జాగ్రత్తలు తీసుకుని కాపలా కాస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ పరిస్ధితులు చైనా సైన్యానికి కొత్తేనట. ఎముకలను సైతం కొరికేస్తున్న చలిని చైనా సైన్యం తట్టుకోలేకపోతోందట. అందుకనే పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురవ్వటమే కాకుండా ప్రతిరోజు ఓ ఇద్దరు సైనికులు చనిపోతున్నారట.
అనారోగ్యానికి గురవుతున్న వారిని, చనిపోతున్న వారిని తీసుకెళ్ళటానికి ప్రతిరోజు హెలికాప్టర్లు తిరుగటాన్ని మన సైన్యం గమనిస్తోంది. ఈ చలిని తట్టుకునేందుకు కేంద్రప్రభుత్వం ముందుటానే హీటింగ్ టెంట్లను, సైన్యం వేసుకునేందుకు వీలుగా హీటింగ్ జాకెట్లను, 24 గంటల సోలార్ హీటర్ల లాంటి అనేక సదుపాయాలను ఏర్పాటు చేసింది. కాబట్టి ఎంత మైనస్ చలికాలంలో కూడా కాపలా కాయటానికి మన సైన్యానికేమీ పెద్దగా సమస్యలు ఎదురుకావటం లేదట.
చలిని తట్టుకునేందుకు మన సైన్యం చేసుకున్న ఏర్పాట్లను చూసిన తర్వాతే డ్రాగన్ అధికారులు మేల్కొన్నారట. దాంతో హడావుడిగా తమకు కూడా అలాంటి ఏర్పాట్లు కావాలని సైన్యాధికారులు ప్రభుత్వానికి చెప్పారట. ప్రభుత్వం స్పందించి వెంటనే కొన్ని ఏర్పాట్లు చేసినా అవన్నీ నాసిరకంగా ఉన్నాయట. మరి హడావుడి చేసిన ఏర్పాట్లలో నాణ్యత ఎక్కడుంటుంది ? అందుకనే సౌకర్యాలు ఉండి లేనట్లుగా తయారవ్వటంతో డ్రాగన్ సైన్యం నానా అవస్తలు పడుతోంది. మన సైన్యమేమో వారాల తరబడి హ్యాపీగా కాపాలా కాస్తుంటే చైనా మాత్రం చలికి తట్టుకోలేక ప్రతిరోజు సైనికులను మార్చేస్తోందట. ఇటువంటి పరిస్దితే మరో రెండు నెలలుంటుందని అంచనా. మొత్తానికి డ్రాగన్ను చలికాలం బాగానే వణికించేస్తోందని సెటైర్లు వేసుకుంటున్నారు మన సైన్యం.