తుని విధ్వంసం ఎపిసోడ్ విచారణను సీఐడీ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఐడీ.. పలువురు అనుమానితుల్ని విచారించింది. తుని విధ్వంసంలో కీలకభూమిక ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డిని సీఐడీ అధికారులు ఇప్పటికే విచారించారు.
ఒకే అంశం మీద తిప్పి తిప్పి ప్రశ్నలు వేసినట్లుగా గతంలో విచారణ సందర్భంగా భూమాన వ్యాఖ్యానించారు. అప్పట్లో రెండు రోజుల పాటు కరునాకర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిసిన నేపథ్యంలో.. ఆయన్ను అదుపులోకి తీసుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా కరుణాకర్ రెడ్డిని మరోసారి సీఐడీ అధికారులు విచారణకు పిలవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఒక ఛానల్ అధిపతిని సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించటం.. ఈ సందర్భంగా తుని సభకు హైదరాబాద్ నుంచి నిధులు అందాయని.. డ్రోన్ కెమేరాలు కూడా హైదరాబాద్ నుంచి వచ్చాయన్న విషయాన్ని వెల్లడించటంతో ఈ కేసు మరో మలుపు తిరిగినట్లుగా భావిస్తున్నారు.
సభ కోసం హైదరాబాద్ నుంచి నిధులు పంపింది ఎవరు? ఎందుకు పంపారు? డ్రోన్లను ఎవరు పంపారు? వాటిని ఎవరు కొనుగోలు చేశారు? లాంటి అంశాలన్నీ కీలకంగా మారాయి. ఈ ప్రశ్నలకు సంబంధించి విచారించిన సీఐడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తుని విధ్వంసంసై రెండోసారి విచారణ ఎదుర్కొంటున్న భూమాన సీఐడీ విచారణకు హాజరయ్యారు. అధికారుల వద్దకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన భూమాన నోటి నుంచి ఒక మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తనను అధికారులు కానీ అరెస్ట్ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పోరాడతానని చెప్పటం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తుని విధ్వంసం కేసుకు సంబంధించి భూమాన అరెస్ట్ ఈ రోజు ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట వినిపిస్తోంది. ఈ కేసుపై పట్టు బిగించేందుకు భూమాన అరెస్ట్ తప్పనిసరి అని.. ఈ దిశగా అధికారులు ప్రశ్నించి ఆయన్ను అదుపులోకి తీసుకునే వీలుందని అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భూమాన నోటి నుంచి సైతం అరెస్ట్ మాట రావటం గమనార్హం.