జగనన్నా.. బీసీల గురించి మనమా మాట్లాడేది? సీమలో ఏం జరిగిందో తెలుసుగా!.. ఇదీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా మేధావులు.. రాజకీయ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సీఎం జగన్.. ఒకింత ఉద్రేకంగా మాట్లాడారు. బీసీలకు మేలు చేస్తున్నది తమ పార్టీయేనని.. తమ ప్రభుత్వమేనని చెప్పారు. బీసీలు వెన్నెముక అని చెప్పుకొన్న చంద్రబాబుకానీ, టీడీపీ కానీ, చేసింది ఏమీలేదన్నారు. అంతేకాదు.. తమ మూడేళ్ల పాలనలోనే.. బీసీ అక్కచెల్లెమ్మలకు చేతినిండా నిండా నిధులు అందుతున్నాయని చెప్పారు.
ఓకే.. సీఎం జగన్ బీసీలకు న్యాయం నిలువునా చేస్తున్నారనే అనుకుంటే.. మరి సీమలోని అసెంబ్లీ స్థానాల్లో వారికి ఎన్ని సీట్లు ఇచ్చారు? అని మేదావులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. సీఎం జగన్ సీమకు చెందిన నాయకుడు. దీంతో్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాలను వదిలేసినా.. కనీసం.. సీమలోని బీసీలకు ఆయన ఏవిధంగా న్యాయం చేశారు? వారికి ఎన్ని సీట్లు కేటాయించారు? అని రాజకీయ నిపుణులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
మొత్తం ఉమ్మడిగా నాలుగు జిల్లాలు ఉన్న సీమలో అసెంబ్లీ లెక్కలను వారు చెబుతున్నారు. వాటిలో మొత్తం 43 స్థానాలు జనరల్‌కు కేటాయించారు. వాస్తవానికి నాలుగు జిల్లాల్లోనూ.. కలిపి.. మొత్తం 52 స్థానాలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ రిజర్వ్‌డ్.. నియోజకవర్గాలు.. 9. ఇవి పోగా.. మిగిలిన వాటిలో ఎన్ని.. బీసీలకు కేటాయించారు? అనేది ఇప్పుడు తెరమీదకి వచ్చిన ప్రశ్న.
జిల్లాల వారీగా చూస్తే..ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉండగా..2 ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా.. మిగిలిన 12 స్థానాల్లో 2 మాత్రమే వైసీపీ అధినేత బీసీలకు కేటాయించారు. కళ్యాణదుర్గం(మంత్రి ఉషశ్రీచరణ్), పెనుకొండ(శంకరనారాయణ).
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా...2 ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా.. మిగిలిన 12 స్థానాల్లో 1 మైనారిటీ, 1 బీసీ గుమ్మనూరు జయరాం(ఆలూరు)కు ఇచ్చారు.
ఉమ్మడి కడప జిల్లా.. మొత్తం సీట్లు.. 10, వీటిలో ఎస్సీలకు కేటాయించినవి.. 2, మిగిలిన వాటిలో 1 మైనారిటీకాగా, బీసీలకు కేటాయించినవి.. 0 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం స్థానాలు.. 14. వీటిలో ఎస్సీలకు కేటాయించినవి.. 3. మిగిలిన వాటిలో వైసీపీ అధినేత జగన్ బీసీలకు కేటాయించిన స్థానాలు.. 3. చిత్తూరు(జంగాలపల్లి శ్రీనివాసులు), ఎం.బాబు(పూతలపట్టు), వెంకట్‌గౌడ్(పలమనేరు).
కొసమెరుపు: అంటే మొత్తంగా 43 జనరల్ స్థానాల్లో బీసీలకు వైసీపీ అధినేత కేటాయించిన సీట్లు కేవలం.. 6 స్థానాలు మాత్రమే. మరీ ముఖ్యంగా.. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఒక్క కడప నియోజకవర్గం తప్ప..(దీనిని మైనారిటీ నేతకు కేటాయించారు).. అన్నీ రెడ్డి సామాజికవ ర్గానికే కేటాయించారు. మరిదీనిని బట్టి.. బీసీలకు మేలు చేస్తున్నామని చెబితే.. ఎవరు మాత్రం నమ్ముతారు? ఎవరు మాత్రం విశ్వసిస్తారు?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.