తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వచ్చింది. అది కూడా మామూలుగా కాదు. దేశం మొత్తం కరోనా కలకలంతో కిందా మీదా పడుతున్న వేళ.. రిజర్వు బ్యాంకు వారు రాష్ట్రం నుంచి తమకు రావాల్సిన మొత్తాన్ని కట్ చేసుకోవటం.. అలా కట్ చేసిన మొత్తం రూ.2500 కోట్లు కావటంతో సారుకు మరింత మండేలా చేసింది. లాక్ డౌన్ వేళ.. రూపాయి పది రూపాయిలుగా మారిపోయిన సందర్భంలో రాష్ట్రాల ఇబ్బందుల్ని పట్టించుకోకుండా భారం మోపేస్తున్న వైనాన్ని ఆయన జీర్ణించుకోలుపోతున్నారు.
అందుకే.. కేంద్రం మీద తనకున్న కోపాన్ని గురి చూసి వదిలిన బాణంలా.. ప్రెస్ మీట్లో ప్రస్తావించటం ద్వారా.. తన ఆగ్రహాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు. కేంద్రం తీరుతో రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. కేంద్రం మీదా.. ప్రధాని మోడీ మీదా తనకున్న కోపాన్ని దాచుకోలేదు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రధాని మోడీని ఉద్దేశించి మౌనంగా.. రాయిలా ఉండి పోతే సరిపోతుందా? అంటూ విరుచుకు పడటం గమనార్హం.
కేంద్రం అనుసరించాల్సిన విధానాల్ని తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. కష్టకాలంలో రాష్ట్రాలకు అండగా ఉండాల్సిన దానికి భిన్నంగా కేంద్రం మౌనంగా ఉండి పోతుందని తప్పు పట్టారు. లాక్ డౌన్ వేళ.. వివిధ రాష్ట్రాలకు రైళ్లను నడిపే క్రమంలో ఛార్జీలను వసూలు చేసిన తీరును తప్పు పట్టారు. రైళ్లు నడవని వేళ.. శ్రామిక్ రైళ్లను నడుపుతున్నప్పుడు.. అదనంగా ఛార్జీలు వసూలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లేందుకు రైళ్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేళ.. అందుకు రూ.6 కోట్ల మొత్తాన్ని రైల్వేలకు చెల్లించినట్లు చెప్పారు.
వలసకార్మికుల్ని తరలించేందుకు వెయ్యికి పైగా ప్రత్యేక ట్రైన్లను వేయాలని తాను కేంద్రహోంమంత్రికి గతంలోనే చెప్పానని.. అప్పుడు చెబితే.. ఇప్పుడు స్పందించారన్నారు. కష్టంలో ఉన్న వేళ.. వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయాలన్న ఆలోచన ఏ మాత్రం సరైనది కాదని తేల్చేశారు. తిండికి లేక సొంతూరుకు పయనమై వెళుతున్న వారిని టికెట్ డబ్బులు చెల్లించాలనటం ఏ మాత్రం సబబు? అని ప్రశ్నించిన ఆయన.. అది సరిపోదన్నట్లుగా టికెట్ కు అదనంగా ప్రత్యేక ఛార్జిని వసూలు చేయటం ఏమిటి? అని నిలదీశారు. ఈ విషయంలో కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైళ్ల ఛార్జీలతో పాటు.. వివిధ ఆర్థిక అంశాల విషయంలో మోడీ సర్కారు తీరును తప్పు పట్టటమే కాదు.. బండకేసి బాదేసినట్లుగా ఘాటు విమర్శలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.