కర్ణాటక కథ కంచికి చేరుతోంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా పరిణామాలు అవే సూచిస్తున్నాయి. బెంగళూరులో సమావేశమైన జేడీఎస్ - కాంగ్రెస్ 32మంది మంత్రులు రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ 32మంది మంత్రుల రాజీనామాతో కుమారస్వామి గవర్నర్ ను కలవడానికి అపాయింట్ మెంట్ కోరినట్టు సమాచారం. దీంతో ఆయన రాజీనామా దిశగానే అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది.
12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో కన్నడ సంకీర్ణ సర్కారు డోలాయనంలో పడింది. తెరవెనుక ఉండి కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కుట్ర చేస్తున్నారన్న విమర్శలు వెలువడుతున్నాయి. అయితే ఎమ్మెల్యేలను బుజ్జగించి ప్రభుత్వం కూలకుండా చూసుకుంటామని.. అయితే కొందరికి సీఎం కుమారస్వామి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని కండీషన్ పెట్టారు.
ఇక అసంతృప్త ఎమ్మెల్యేలు మాత్రం సిద్ధరామయ్యనే సీఎంగా ఉండాలని కోరుతున్నారు. దీన్ని అధికార జేడీఎస్ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం కూలినా కానీ సిద్ధరామయ్యను సీఎం కానివ్వమని జేడీఎస్ అధినేత దేవెగౌడ స్పష్టం చేశారు.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి రాకపోవడం.. బీజేపీ తెరవెనుక ఉండి ప్రయత్నాలు చేస్తుండడంతో మంత్రులంతా రాజీనామాలు చేసి కుమారస్వామికి ఇచ్చేశారు. ఆయన గవర్నర్ ను కలవబోతున్నారు. దీంతో కన్నడ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందోనన్న టెన్షన్ నెలకొంది.