జనమనగణకులేవమంటే కొడతామన్నఅమ్మాయిలు

Update: 2016-01-19 06:59 GMT
దేశంలోని ప్రజాస్వామ్యం ఇస్తున్న స్వేచ్ఛ మరీ ఎక్కువ అవుతుందా? అన్న సందేహం కలిగించే ఉదంతంగా చెప్పొచ్చు. మరే దేశంలోనూ లేని విధంగ మనదేశంలోనే జాతీయ గీతం విషయంలోనూ చర్చలు సాగుతుంటాయి. థియేటర్ లో సినిమాలు ప్రదర్శించే ముందు జాతీయ గీతాలాపన విషయంలో పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.

వేదిక ఏదైనా కానీ.. జాతీయగీతాన్ని ఆలపించే విషయంలోక్రమశిక్షణతో లేచి నిలవటానికి వచ్చిన నొప్పి ఏమిటో అర్థం కాదు. లేచి నిలబడితేనే కమిట్ మెంట్ ఉన్నట్లా? లాంటి చిత్రమైన ప్రశ్నలు వేసే బ్యాచ్ కూడా ఉంటారు. ఇంత చర్చ ఎందుకు.. సింఫుల్ గా జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో బుద్దిగా లేచి నిలబడితే ఏమవుతుందన్న మాటకు మూతి విరుపులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ముంబయిలోని ఒక థియేటర్ లో ఇద్దరు అమ్మాయిల ప్రవర్తన వివాదంగా మారింది. ముంబయి అంధేరీ శివారుకు చెందిన ఇన్ ఫినిటీ మాల్ లోని ఒక సినిమా థియేటర్ లో సినిమా చూసేందుకు సామాజిక ఉద్యమకార్యకర్త శీతల్ మాత్రే.. ఆమె స్నేహితురాలు జ్యోతి భట్ తో కలిసి సినిమాకు వెళ్లారు. సినిమా స్టార్ట్ అయ్యే సమయంలో జాతీయ గీతం ఆలపిస్తుండగా.. థియేటర్ లోని ఇద్దరు యువతులు మాత్రం లేచి నిలబడలేదు.

ఎందుకలా అని ప్రశ్నిస్తే.. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ.. మమ్మల్నే తప్పు పడతావా? నోరు మూసుకొని వెళ్లకుంటే.. దెబ్బలు తప్పవంటూ బెదిరించటంతో సదరు సామాజిక వేత్తల నోట మాట రాని పరిస్థితి. జరిగిన ఉదంతంపై వారు పోలీస్ స్టేషన్లో సదరు యువతుల మీద ఫిర్యాదు చేశారు. సదరు యువతుల్ని పిలిపించిన పోలీసులు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఏది ఏమైనా ఇలాంటి అంశాల మీద చట్టం కాస్త కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News