ఆ రోజు నుంచి పూర్తి లాక్ డౌన్‌?

Update: 2021-05-06 01:30 GMT
క‌ర్నాట‌క రాష్ట్రాన్ని క‌రోనా అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. నిత్యం 20 వేల‌కు పైగా కేసులు న‌మోదు అవుతుండ‌డంతో.. ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా త‌యారైంది. దీంతో.. ప్ర‌భుత్వం ఏప్రిల్ 27 నుంచి మే 12 వ‌ర‌కు లాక్ డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయినా.. కేసుల ఉధృతి త‌గ్గట్లేద‌ని స‌మాచారం. దీంతో.. సంపూర్ణ లాక్ డౌన్ దిశ‌గా రాష్ట్ర స‌ర్కారు ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో ఆ రాష్ట్రంలో 20,870 మంది కొవిడ్ బారిన ప‌డిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఒక్క రోజులోనే 132 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు తెలుస్తోంది. ఇక యాక్టివ్ కేసులు కూడా గ‌ణ‌నీయంగా పెరిగాయి. ఏకంగా 3 ల‌క్ష‌లు దాటేసిన‌ట్టు స‌మాచారం. దీంతో.. కొవిడ్ ను ఎలా అదుపులోకి తేవాలో తెలియ‌క అధికారులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణ‌యం తీసుకునే అవకాశం ఉంద‌ని అంటున్నారు. 12వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ విధించిన నేప‌థ్యంలో.. ఆ త‌ర్వాత నుంచి నిర‌వ‌ధిక‌ లాక్ డౌన్ అనౌన్స్ చేస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని తెలుస్తోంది.

అయితే.. దీనిపై సీఎం య‌డ్యూర‌ప్ప మాట్లాడుతూ.. లాక్ డౌన్ వార్త‌ల‌ను ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మే 12 త‌ర్వాత ఏం చేయాల‌నే విష‌య‌మై ప్ర‌ధానితో మాట్లాడ‌తామ‌ని చెప్పారు. దీంతో.. లాక్ డౌన్ ఆలోచ‌న తోసిపుచ్చ‌డానికి లేద‌నే విష‌యం తేలిపోయింద‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News