మోడీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ చేసింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దాదాపు 25 నెలల తర్వాత కాంగ్రెస్ ఆర్థికపరమైన అంశాలకు సంబందించి ఒక భారీ కుంభకోణం జరిగిందని.. దీన్లో ప్రధాని మోడీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా భాగస్వామ్యం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. రెండేళ్ల తర్వాత మోడీ మీద వేసిన మొదటి కుంభకోణ మరకగా దీన్ని చెప్పాలి. కాంగ్రెస్ చెబుతున్నట్లుగా నిజంగానే ఈ కుంభకోణంలో మోడీ పాత్ర ఉందా? లేదా? అన్న విషయాల్లోకి వెళితే..
ఆరోపణలు చేసిందెవరు..?
కాంగ్రెస్ అధికార ప్రతినిధులు రణ్ దీప్ సుర్జేవాలా.. శక్తి సిన్హా గోహి.. ఆర్ పీఎన్ సింగ్ లు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మోడీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇంతకీ వారి ఆరోపణలు ఏంటి?
ఈ కాంగ్రెస్ నేతలు చెప్పిన మొత్తం విషయాన్ని మూడు ముక్కల్లో తేల్చి చెప్పాలంటే.. ఆరు ప్రముఖ టెలికం కంపెనీలు ప్రభుత్వానికి కట్టాల్సిన రుసుములు ఎగవేశారు. దీని వల్ల ఖజానాకు కలిగిన నష్టం రూ.45వేల కోట్లు. ఈ విషయాన్ని కాగ్ చెప్పినా.. ప్రధాని మోడీ మాత్రం లైట్ తీసుకున్నట్లు ఉండిపోయారు. దీని వల్ల టెలికం కంపెనీలు లబ్థి పొందగా.. ప్రభుత్వ ఖజానాకు భారీగా వచ్చే ఆదాయం కోల్పోయింది.
ఆరోపణలు ఏ కంపెనీల మీద..?
ప్రభుత్వానికి కట్టాల్సిన రుసుముల్ని ఎగవేసినట్లుగా కాంగ్రెస్ చెబుతున్న టెలికం కంపెనీలు ఏవంటే.. భారతి ఎయిర్ టెల్.. వోడాఫోన్.. రిలయన్స్.. ఐడియా.. టాటా.. ఎయిర్ సెల్.
ఇంతకీ ఈ ఆరోపణ ఏమిటి?
కాంగ్రెస్ ఆరోపణల్ని పరిశీలిస్తే ఆసక్తికర అంశాలుబయటకు వస్తాయి. మోడీ హయాంలో కుంభకోణం జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్నప్పటికీ.. వారు అందిస్తున్న వివరాలు చూస్తే.. యూపీఏ సర్కారు హయాంలోనే జరిగిన లావాదేవీలపై కాగ్ తనిఖీలు చేసింది. 2006 నుంచి 2010 వరకు జరిగిన లావాదేవీల్ని కాగ్ పరిశీలించింది. ఆదాయాన్ని తక్కువ చేసి చూపించటం.. చెల్లించాల్సిన అనుమతుల రుసుముల్ని కట్టేందుకు ముందుకు రాకపోవటం లాంటి అంశాల్ని పరిశీలించింది. ఆరు టెలికం కంపెనీలు నాలుగేళ్లలో రూ.46.04వేల కోట్ల ఆదాయాన్ని తక్కువ చేసి చూపించినట్లు కాగ్ ధ్రువీకరించింది. అయితే.. ఈ విషయాలపై మోడీ సర్కారు వెంటనే స్పందించాల్సి ఉందని.. కానీ తమ వద్ద ఉన్న చార్టెడ్ అకౌంట్లతో ఈ వివరాల్ని వేరే విధంగా మదింపు వేయాలని ఆదేశించిందంటూ మోడీ సర్కారుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆరు టెలికం కంపెనీలపై కాగ్ ఇచ్చిన నివేదికను మళ్లీ మదింపు చేయాలన్న ఆదేశాల వెనుక అసలు ఉద్దేశం వేరని.. కాగ్ నివేదికలోని అంకెల్ని తారుమారు చేయటానికే ఇలా చేశారన్నది ఆరోపణ.
ఈ స్కాంపై బీజేపీ వాదన ఏమిటి?
కాంగ్రెస్ ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. ఆరు సంస్థలకు సంబంధించిన లెక్కల్లో వ్యత్యాసాలు బయటపెట్టిన కాగ్ నివేదికలో ప్రభుత్వ కాలం కాంగ్రెస్ హయాంలోని యూపీఏ లోనిదేనని.. అంటే.. మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించటానికి ముందే జరిగినవి అని చెబుతోంది. కాగ్ అందించిన పత్రాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందని.. అనుమతుల ఒప్పందాల ప్రకారం వడ్డీ.. జరిమానా సహా రావాల్సిన అన్ని మొత్తాల్ని తాము వసూలు చేస్తామని.. ఖజానాకు ఎలాంటి నష్టం వచ్చేలా తమ ప్రభుత్వం వ్యవహరించదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. తప్పులు జరిగినట్లుగా కాగ్ గుర్తించింది యూపీఏ హయాంలో అయితే.. ఆ తప్పులకు సంబంధించిన చర్యలు తీసుకోవటంలో ఆలస్యం చేస్తున్నట్లుగా మోడీ సర్కారు మీద మరక వేస్తున్న తీరు చూస్తే.. త్వరలో తమ మీద పడే మరక ను మోడీ సర్కారుకు కూడా షేర్ చేసే ఆలోచనలోనే తాజా ఆరోపణలుగా కనిపిస్తుండటం గమనార్హం.