పొంగులేటిని కాంగ్రెస్ లోకి లాగుతున్న రేవంత్ రెడ్డి

Update: 2023-02-08 14:02 GMT
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధాంతం మంచిదని.. ఆయన వస్తే కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటికి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చాలాంగా పార్టీ బలోపేతంపై

కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ విధానాలతో విసిగిపోయిన లీడర్లను తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది. ముఖ్యమైన నేతలకు గాలం వేసే పనిలో ఉన్నది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేసింది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరుపుతోంది.  పొంగులేటిని కాంగ్రెస్సీనియర్ నేత  భట్టి విక్రమార్క పార్టీలోకి కూడా ఆహ్వానించారు. ఈసారి ఎలాగైనా సరే తెలంగాణలో అధికారం సాధించేందుకు కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.

ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని.. హైకమాండ్ ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించిందని రేవంత్ రెడ్డి తెలిపారు..  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫిరాయింపుల చట్టాన్ని కఠినం చేస్తామని.. ఎమ్మెల్యే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గిస్తామని తెలిపారు.

టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర రూట్ మ్యాప్ సైతం ఈ రూట్లలోనే ఉండే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో అధికారంలోకి రావడంతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ స్థానాలను సైతం కైవసం చేసుకోవడానికి ఏఐసీసీ కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే తొలుత 3 రిజర్వుడు లోక్ సభ స్థానాలకు కో ఆర్డినేటర్లను నియమించింది.మిగిలిన రిజర్వుడు నియోజకవర్గాలకు కూడా త్వరలోనే కోఆర్డినేటర్లను నియమించనున్నారు.

కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని.. తాను కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ ’ జోడో యాత్ర ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతోంది.

Similar News