తెలంగాణలో జరుగుతున్న ఏకైన ఉప ఎన్నిక దుబ్బాక ఆసక్తి రేపుతోంది. ఇక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎత్తులు గులాబీ పార్టీని కలవరపెడుతున్నాయి. నవంబర్ 3 న జరగనున్న ఉప ఎన్నికకు టిఆర్ఎస్ అభ్యర్థిపై పోరాడటానికి ప్రతిపక్ష పార్టీలు.. కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ గట్టి అభ్యర్థులను నిలబెట్టుతున్నాయి. ఫలితాలు నవంబర్ 13 న ప్రకటిస్తారు.
మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామచంద్రారెడ్డి భార్య సోలిపేట సుజాత అభ్యర్థిత్వాన్ని సోమవారం రాత్రి టిఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది. సోలిపేట ఆకస్మిక మరణంతో ఆయన భార్యకే టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి సానుభూతి ఓట్లను పొందేందుకు రెడీ అయ్యాయి.
మరోవైపు, దుబ్బాకకు చెందిన పి రఘునందన్ రావు అభ్యర్థిత్వాన్ని బిజెపి ప్రకటించింది. కొన్నేళ్లుగా ఆయన బిజెపిలో దూకుడైన రాజకీయంతో ఫేమస్ అయ్యారు. అంతకుముందు టిఆర్‌ఎస్‌లో చాలా కాలం ఫైర్ బ్రాండ్ నేతగా కొనసాగారు. టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు మాదిరిగానే రఘునందన్ కూడా ఓటర్లతో తన పరిచయాలను ఏర్పరచుకుంటూ చాలా కాలం నుండి దుబ్బాకలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో సడన్ గా టీఆర్ఎస్ కు షాకిచ్చింది. గతంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన టీఆర్ఎస్ నేత.. మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లాగేసుకుంది. దివంగత ముత్యం రెడ్డికి ప్రజలలో చాలా మంచి పేరు ఉంది. అతడి కుటుంబానికి ఇప్పటికీ దుబ్బాకపై చాలా పట్టు ఉంది.
ఇప్పటికే ఆదివారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో సిద్దిపేట డీసీసీ తూంకుంట నర్సిరెడ్డి పేరును సూత్రప్రాయంగా ఖరారు చేశారు. ఈ మేరకు మీడియాకు లీకులు ఇచ్చారు. దీంతో ఆయనే దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి అని అంతా భావించారు. కానీ సడన్ గా కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా చక్రం తిప్పారు.
కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా చివరి నిమిషంలో దుబ్బాకకే చెందిన దివంగత మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి పేరును ప్రతిపాదించారు. ఆయనకు నియోజకవర్గంలో పరపతి ఉందని.. ముత్యంరెడ్డి అనుచరగణం తోడుగా ఉందని.. ఓటు బ్యాంకు భారీగా ఉందని దామోదర్ వివరించారు. పైగా మల్లన్న సాగర్ బాధితుల పక్షాన తాను చేసిన పోరాటంలో శ్రీనివాసరెడ్డి కూడా కీలక పాత్ర పోషించినట్టు కూడా దామోదర్ వివరించారు. దామోదర్ రాజనర్సింహా వేగంగా పావులు కదిపి అందరినీ ఒప్పించారు.
ఈ క్రమంలోనే 2023లో కూడా దుబ్బాక టికెట్ ఇస్తే టీఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లో చేరుతానని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉత్తమ్, కాంగ్రెస్ అధిష్టానం ఒకే చెప్పడంతో ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు శ్రీనివాసరెడ్డి.
దీంతో దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలవబోయే కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి పేరు దాదాపుగా ఖారారైంది. బుధవారం శ్రీనివాసరెడ్డి పేరును అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించనున్నట్టు సమాచారం.
దీంతో ముగ్గురు బలమైన నాయకులు బరిలో ఉండడంతో దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టిఆర్ఎస్ ఈ సిట్టింగ్ సీటును నిలుపుకోవడం చాలా కష్టమైన పని అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.