ప్రియాంక ఎంట్రీ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పుంజుకుందే!

Update: 2019-10-26 14:30 GMT
తమ పార్టీకి ఆఖరి తురుపుముక్కగా ప్రియాంకను భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ స్వయంగా ఎంపీగా ఓడిపోయిన నేపథ్యంలో ప్రియాంక  వచ్చి పార్టీని రక్షించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడిపోయినా… ప్రియాంక రావాలనే డిమాండ్ వాయిస్ గా వినిపిస్తోంది. అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ప్రియాంక ఎలాంటి బాధ్యతలూ తీసుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంతపుంజుకుంది.

ప్రియాంక ఇప్పటి వరకూ బ్యాక్ రూమ్ పాలిటిక్స్ కే పరిమితం అయ్యారు. నేతలతో అడపాదడపా చర్చలు జరపడం, తల్లి-అన్నలతో చర్చించడం.. వంటివి మాత్రమే చేశారు ప్రియాంక. ఆమె పార్టీకి సంబంధించి ఎలాంటి పదవులూ తీసుకోలేదు.

ఇంతలోనే మహారాష్ట - హర్యానా ఎన్నికలు వచ్చాయి. అవి కాంగ్రెస్ కు కీలకమైన రాష్ట్రాలు కూడా. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో జాతీయ నాయకులు రంగంలోకి దిగి రక్షించే ప్రయత్నాలు కూడా చేయలేదు.

అయినా కాంగ్రెస్ కొంత వరకూ కోలుకుంది. అధికారం సొంతం చేసుకోలేకపోయినా.. ఎంతో కొంత లాభపడింది. మరి కాంగ్రెస్ వాళ్లు సీరియస్ రాజకీయాలు చేయకుండానే.. ఆ పార్టీ పుంజుకుంది.

ఆ పార్టీ జాతీయ నాయకత్వం లోక్ సభ ఎన్నికల ఓటమి నిస్పృహ నుంచి బయట పడకపోయినా.. ఆ పార్టీ పట్ల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతో కొంత సానుకూలత చూపించారు. ఇది కాంగ్రెస్ కు ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే. ఇక ప్రియాంక కూడా ధైర్యంగా బరిలోకి దిగవచ్చేమో!

Tags:    

Similar News