అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని చోట్లకు పాకిపోయే కరోనా.. కొన్ని ప్రాంతాలకు విస్తరించకపోవటం అప్పుడప్పుడు వార్తాంశంగా మారుతూ ఉంటుంది. ఆనందయ్య అనే ఆయుర్వేద నిపుణుడి పుణ్యమా అని.. ఎక్కడో తన మానాన తాను ఉండే నెల్లూరు జిల్లా క్రిష్ణపట్నం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మాయదారి మహమ్మారికి మందు ఇస్తున్నారన్న కారణంగా.. రోజుకు వేలాది మంది ఆ ఊరికి రావటం.. వచ్చిన వారిలో 90 శాతం మంది కరోనా బాధితులే కావటం తెలిసిందే.
మందు తీసుకునేందుకు వచ్చిన జనసందోహం.. పెద్ద ఎత్తున రద్దీ నేపథ్యంలో.. ఆ ఊళ్లో కరోనా ముప్పు ఉంటుందన్న అంచనా వేశారు. ఇప్పటివరకు ఆ గ్రామంలో కరోనా కేసులు నమోదు కాలేదని చెబుతారు. తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితి. ఆదివారం క్రిష్ణపట్నంలో నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది. అత్యవసరంగా ముగ్గురికి పరీక్షలు చేస్తే.. ఇద్దరికి పాజిటివ్ గా తేలిందన్నారు.
మరో 27 మందికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వారందరికి ఆర్టీపీసీఆర్ పరీక్షల్ని నిర్వహించి ఆ శాంపిళ్లను పంపారు. రెండు రోజుల పాటు గ్రామంలో మరిన్ని పరీక్షలు చేయనున్నారు. ఇటీవల కాలంలో ఆనందయ్య మందు కారణంగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన క్రిష్ణపట్నంకు.. పెద్ద ఎత్తున కరోనా రోగులు రావటం కూడా.. తాజా కేసుల నమోదుకు కారణమన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.