కరోనా భాద్యత చైనాదే ...మళ్లీ రెచ్చిపోయిన ట్రంప్ !

Update: 2020-03-21 09:55 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించడానికి ముఖ్య కారణం చైనానే అంటూ మరోసారి అమెరికా అధినేత  ట్రంప్ విమర్శించారు. కరోనా వైరస్  వూహాన్‌ లో  గుర్తించిన వెంటనే చైనా బయటపెట్టలేదని, దాని వల్లే ప్రపంచం ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వుహాన్ లో కరోనా బయటపడినప్పుడే ఇతర దేశాలకి హెచ్చరికలు జారీచేసింటే ..ప్రపంచ దేశాలు ఈ రోజు కరోనా భారీ నుండి తప్పించుకునేవి అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

కరోనా వైరస్‌పై కొద్దినెలలు ముందుగా మనకు సమాచారం ఉంటే బాగుండేదని, చైనాలో ఈ వైరస్‌ పుట్టుకొచ్చిన ప్రాంతానికే దాన్ని కట్టడి చేసి ఉండాల్సిందని వైట్‌ హౌస్‌ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌ కామెంట్స్ చేసారు. ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలుసని, ఇదే నిజమని తాను కూడా నమ్ముతున్నానని చెప్పారు. చైనా కరోనావైరస్ పట్ల వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరి వల్లే ఇప్పుడు ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకుంటోందని మండిపడ్డారు. కరోనావైరస్ గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని ధ్వజమెత్తారు. రోనావైరస్ తీవ్రతను ప్రపంచ దేశాలకు తెలియకుండా.. చైనా అక్కడి వైద్యులు, జర్నలిస్టులను కట్టడి చేసిందని ఆరోపించారు.  

కాగా, కరోనావైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. 2లక్షల మందికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలో 200 మరణాలు సంభవించగా.. 14వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక భారతదేశంలో 244 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఐదు మరణాలు సంభవించాయి. కాగా, గత ఏడాది డిసెంబర్‌ 31న సోషల్‌ మీడియాలో వైరస్‌ గురించి తొలిసారిగా రాసి, ఆ తర్వాత కరోనా వైరస్ తో మరణించిన డాక్టర్‌ లీ వెలింగ్‌ ను స్ధానిక పోలీసులు వైరస్‌ పై నోరుమెదపవద్దని హెచ్చరించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News