వైరస్ మహమ్మారీ ఎవరినీ విడిచిపెట్టడం లేదు. సామాన్యులు మాన్యులు అనే తేడా లేకుండా అందరినీ ఆస్పత్రుల పాలు చేస్తోంది. సినీరాజకీయ ప్రముఖులెందరో ఇప్పటికే ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుంటున్నారు. అయితే కొందరు ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు కరోనా సోకడంతో మృతి చెందడం తెలిసినదే.
ఇటీవల డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ కు కరోనా సోకిన సంగతి విధితమే. చెన్నై నందబాక్కంలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 4 రోజులుగా చికిత్స కొనసాగుతుండగా.. కొంతవరకూ మహమ్మారీ నుంచి ఉపశమనం లభించిందిట. కానీ విజయ్ కాంత్ కు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురయ్యాయని వైద్యులు వెల్లడించారు.
ఊపిరి తిత్తుల సమస్యను పరిష్కరించేందుకు డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. ఇక త్వరగా తగ్గేందుకు రోగనిరోధక మందులతో పాటు కబసుర కషాయాన్ని అందిస్తున్నారట. మరో ఐదు రోజుల్లో పూర్తిగా కోలుకునేందుకు ఆస్కారం ఉందని ధీమాగా చెబుతున్నారు.