ఏపీలో 9 , తెలంగాణ 6 కొత్త కేసులు .. మొత్తం ఎన్ని కేసులంటే ?

Update: 2020-04-16 08:10 GMT
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో మరో 9 కరోనా కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలలో 3, కర్నూలులో 3 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన ఈ 9 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు చేరింది. అందులో 20 మంది డిశ్చార్జి కాగా, 14 మంది ఇప్పటి వరకు మరణించారు. ప్రస్తుతం 500 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏపీలో  జిల్లాల వారీగా కరోనా కేసులని ఒకసారి చూస్తే.. అనంతపూర్‌ లో 21, చిత్తూరులో 23, తూర్పు గోదావరిలో 17, గుంటూరులో 122, కడపలో 36, కృష్ణాలో 48, కర్నూలులో 113, నెల్లూరులో 58, ప్రకాశంలో 41, విశాఖపట్నం లో 10, పశ్చిమ గోదావరిలో 34 కేసులు నమోదు కాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇకపోతే , ఏపీలోని కరోనా హాట్‌ స్పాట్ జిల్లాలను కేంద్రం ప్రకటించింది.  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలు అన్ని కూడా హాట్ స్పాట్ జిల్లాలుగా ఉన్నాయి.

ఇకపోతే , తెలంగాణలో  కొత్తగా 6 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. బుధవారం 8 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 650కి చేరగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 118కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 514 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  కరోనా కేసుల్లో ఎక్కువగా జీహెచ్ ఎం సీ పరిధిలో 267 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌ లో36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వికారాబాద్ (32), సూర్యాపేట (23) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జనగామ జిల్లాలో ఇద్దరికి కరోనా సోకగా.. వారిద్దరూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మహబూబాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో నలుగురు కోవిడ్ బారిన పడగా ఇద్దరు కోలుకున్నారు, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కాగా , తెలంగాణలో 8 హాట్ స్పాట్లను కేంద్రం గుర్తించింది.   ఇకపోతే ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 12380 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో 1344 మంది కరోనా పై పోరాడి విజయం సాధించగా ..414 మంది మృతి చెందారు. మొత్తంగా దేశ వ్యాప్తంగా 170 హాట్‌ స్పాట్లను కేంద్రం గుర్తించింది.
Tags:    

Similar News