మహిళ ప్రాణాలు తీసిన రెడ్ జోన్.. ఎలా అంటే ?

Update: 2020-05-02 10:50 GMT
కర్నూలు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. లాక్ డౌన్ కారణంగా రెడ్ జోన్‌ లో ఉన్న వారికి వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏపీలోని కర్నూలు జిల్లాలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 400 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  అందులో 360 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 66 మంది డిశ్చార్జ్ అవ్వగా 10 మంది మరణించారు.

కేంద్రం ప్రకటించిన రెడ్ జోన్ లిస్ట్ లో కర్నూలు జిల్లా కూడా ఉంది. దీనితో వైద్యులు కూడా ఏమి చేయలేని పరిస్థితి.  ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... నంద్యాల పట్టణానికి చెందిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె పరిస్థితి కొంచెం ఆందోళన కారణంగా ఉండటంతో  కుటుంబసభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో ఆమెకు చికిత్స చేసేందుకు అక్కడున్న వైద్య సిబ్బంది నిరాకరించారు. కటుంబసభ్యులు ఎంత వేడుకున్నా వారు వైద్యంచేయలేదు. రెడ్ జోన్లో ఉన్న వారికి వైద్య సాయం చేయలేము అని, నిబంధనలు అలాగే ఉన్నాయి కాబట్టి మేం ఇలానే వ్యవహరిస్తామన్నారు. ఒక్క ఇంజక్షన్ ఇచ్చి మహిళా పేషంట్‌ ను ఇంటికి పంపించేశారు.

అయితే , ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇంటికి వెళ్లిన కాసేపటికే ఆ మహిళ మృతి చెందింది. దీంతో ఆస్పత్రి తీరుపై కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. తన తల్లికి వైద్యం అందించి ఉంటే బతికి ఉండేందని కొడుకు ఆరోపిస్తున్నాడు. తల్లి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. మహిళ మృతికి ఆస్పత్రి సిబ్బందే కారణమంటూ మృతురాలు కుటుంబసభ్యులు సైతం నిరసనకు దిగారు. దీంతో  పోలీసులు రంగంలోకి దిగి వారికీ సర్దిచెప్పారు. మొత్తంగా కరోనా లాక్ డౌన్ నిబంధనలతో రెడ్ జోన్లలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందు పడుతున్నారు.
Tags:    

Similar News