కరోనా నిర్దారణ పరీక్షల విషయంలో ఏపీ దూసుకెళుతోంది. దేశంలో మరే రాష్ట్రంలోనే లేని విధంగా ఏపీ కరోనా టెస్టుల్ని భారీగా నిర్వహిస్తోంది. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే.. ఏపీలోనే ఎక్కువ పరీక్షలు నిర్వహించినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోని యాభై దేశాల కంటే ఏపీనే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తుండటం గమనార్హం.
ప్రతి పదిలక్షల జనాభాకు ఏపీలో 2,345 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సరాసరి పరీక్షల కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఏపీలో టెస్టులు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా లెక్కలోకి తీసుకుంటే ప్రతి పది లక్షల మందిలో కేవలం 798 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే.. దేశ సరాసరితో పోలిస్తే.. ఏపీలో దగ్గర దగ్గర 280 శాతం ఎక్కువగా టెస్టులు చేస్తున్నట్లు చెప్పాలి. ఏపీలో చేస్తున్న పరీక్షలు ఎంత ఎక్కువన్న విషయాన్ని ఒక ఉదాహరణను చూస్తే ఇట్టే అర్థమై పోతుందని చెప్పాలి.
జపాన్ లాంటి తోపు దేశంలోనూ ప్రతి పది లక్షల జనాభాకు నిర్వహిస్తున్న పరీక్షలు కేవలం 1377 మాత్రమే కావటం గమనార్హం. సోమవారం నాటికి ఏపీలో నిర్వహించిన పరీక్షలు అక్షరాలా 1,25,229. ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే.. ప్రతి పది లక్షల జనాభాకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షల లెక్క చూస్తే.. బ్రెజిల్ 1597 చొప్పున చేస్తుంటే.. అర్జెంటీనా 1361 పరీక్షల్ని నిర్వహిస్తోంది. శ్రీలంక 1099.. ఫిలిప్పీన్స్ 1050.. ఈజిప్టు 879.. మెక్సికో 707.. అల్జీరియా 148 పరీక్షల్ని నిర్వహిస్తోంది. సోమవారం నాటికి ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 1650. మొత్తం పరీక్షల్లో పాజిటివ్ కేసుల శాతం 1.32గా చెబుతున్నారు. మృతుల సంఖ్య కూడా 2 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.