ఏపీలో ఘోరం: క‌రోనాను జ‌యించిన మ‌హిళ‌ను గెంటేసిన య‌జ‌మాని

Update: 2020-05-06 15:30 GMT
క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో మ‌నిషి.. మ‌నిషికి దూరంగా ఉంటున్నారు. కొంత వివ‌క్ష‌భావం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో వైర‌స్ అనుమానితుల‌తో పాటు బాధితుల‌పై తీవ్ర వివ‌క్ష చూపిస్తున్నారు. క‌రోనా వైర‌స్ సోకిన వారిని అంట‌రానివారుగా చూస్తున్నారు. సంఘంలో నుంచి బ‌హిష్క‌రించిన‌ట్టు సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. గ‌తంలో క‌ర్నూలు జిల్లాలో క‌రోనా మృతుడి అంత్య‌క్రియ‌లు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా క‌రోనా సోకిన మ‌హిళ కోలుకుని ఇంటికి రాగా ఆమెను ఇంటి య‌జ‌మాని గెంటేశాడు. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తిలో చోటుచేసుకుంది.

శ్రీకాళహస్తిలోని త‌హ‌సీల్ కార్యాల‌యంలో అటెండ‌ర్‌ గా ప‌ని చేస్తున్న మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ తేలింది. దీంతో ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తాజాగా ఆమె చికిత్స పొంది ఆరోగ్యంగా తిరిగి వ‌చ్చింది. ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన ఆ మహిళను ఇంటి య‌జ‌మాని అవ‌మానించాడు. ఆమెను ఇంట్లోకి రానివ్వ‌లేదు. వెంట‌నే ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించి వెంట‌నే ఇంటికి తాళం వేసుకుని ఆయ‌న‌ వెళ్లిపోయాడు. దీంతో ఆమె షాక్‌కు గుర‌య్యింది. ఈ విషయం తహ‌సీల్దార్ జరీనాకు తెలిసింది.  ఆమె స్పందించి బాధితురాలికి ఒక చోట ఆశ్రయం కల్పించారు.

ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి. క‌రోనా వైర‌స్ సోకింది. సోకితే వారిని వివ‌క్ష చూపొద్ద‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెబుతూనే ఉన్నాయి. పోరాడాల్సింది వైర‌స్‌తో కానీ బాధితుల‌తో కాద‌ని చెప్పినా ప్ర‌జ‌లు మార‌డం లేదు. కరోనా బాధితులపై వివక్ష చూపవ‌ద్ద‌ని ప్ర‌భుత్వ అధికారులు కోరుతున్నారు.
Tags:    

Similar News