కరోనా దారుణం: ఇటలీలో మరణ మృదంగం

Update: 2020-03-28 04:01 GMT
కరోనా ధాటికి ఇటలీ శవాల దిబ్బగా మారుతోంది. మరణ మృదంగం వాయిస్తోంది. ఇటలీలో కన్నీళ్లు కూడా ఆగిపోయి రక్త కన్నీరు కారుతున్న దయనీయ స్థితి నెలకొంది.

ఇటలీలో నిన్న ఒక్క రోజే కరోనా వైరస్ వల్ల 919 మంది చనిపోయారు. దీంతో ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 9134కు చేరుకుంది. పదివేల మరణాలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా ఇటలీలో కేసుల సంఖ్య కూడా తగ్గకపోవడం కలవరపెడుతోంది. కొత్తగా 5909 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా కేసుల సంఖ్య 86498కు చేరుకున్నాయి.

చైనాలో కరోనా సోకగానే సెలవులు ఇచ్చేసిన ఇటలీ సర్కారు ప్రజలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైంది. అదే ఇప్పుడు షాపమై అందరికి పాకి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది.

ఫిబ్రవరి 15న కేవలం 3 కేసులు నమోదైన ఇటలీలో నేడు 86వేల కేసులకు చేరింది. ప్రభుత్వ ఆదేశాలను అక్కడి ప్రజలు పట్టించుకోక నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దుస్థితి దాపురించింది.
Tags:    

Similar News