రాష్ట్రం ఏదైనా గుండెకాయ లాంటిది సచివాలయం. రాష్ట్ర పాలనా రథం అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ముఖ్యమంత్రి మొదలు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి కీలకమైన అధికారులంతా సచివాలయంలోనే ఉంటారు. అలాంటి సచివాలయ భవనంలోకి కరోనా వచ్చేస్తే? పరిస్థితి ఎలా ఉంటుంది? ఉద్యోగులు మొదలు.. కీలక ఉద్యోగుల వరకూ ఒక్కసారిగా ఉలిక్కిపడిన వైనం ఇప్పుడు తెలంగాణలో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో తాత్కాలిక సచివాలయంగా బీఆర్కే భవన్ ను వినియోగిస్తుంటారు. పాత సచివాలయం స్థానంలో కొత్తది కట్టాలని సీఎం కేసీఆర్ డిసైడ్ చేయటం.. ఇందులో భాగంగా పాత సచివాలయాన్ని ఖాళీ చేసి.. బీఆర్కే భవన్ కు తాత్కాలికంగా తరలించారు. ఇందులో ఏర్పాటు చేయని కార్యలయాల్ని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. బీఆర్కే భవన్ లో పని చేసే ఉద్యోగి ఒకరికి కరోనా పాజిటివ్ అన్నట్లు చెబుతున్నారు. దీంతో.. సచివాలయంలోని ఉద్యోగులు..కీలక అధికారులంతా ఉలిక్కిపడటమే కాదు.. కొత్త భయాందోళనలు వారిని చుట్టు ముట్టాయి. బీఆర్కే భవన్ కు చెందిన ఉద్యోగి ఒకరు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చారు. తాజాగా సదరు ఉద్యోగికి కరోనాపాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.
దీంతో.. సదరు ఉద్యోగి కలిసిన ఉద్యోగులు.. ఆ ఉద్యోగులు కలిసిన ఉన్నతోద్యోగులు.. వారు కలిసిన కీలక ఉద్యోగులు.. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళితే.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకూ కాంటాక్టు వెళ్లే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక టీంలోని పలువురికి కరోనా భయాందోళనల్లోకి జారే అవకాశం ఉంది. అయితే.. అవసరానికి మించిన భయానికి గురి అవుతున్నారని.. అలాంటిదేమీ ఉండదని చెబుతున్నారు. ప్రమాద తీవ్రత ఎంతన్నది ఇప్పటికి ఒక కొలిక్కి రాకున్నా.. పాలనా పరంగా కీలకమైన సెక్రటేరియట్ కు కరోనా భయం తాజా ఉదంతంతో ఒక్కసారి వ్యాపించిందన్న మాట బలంగా వినిపిస్తోంది.