తూ.గో. జిల్లాలో కరోనా వాహకాలుగా ఆర్ ఎంపీలు!

Update: 2020-04-21 13:30 GMT
కొందరు ఆర్ ఎంపీ వైద్యుల కాసుల కక్కుర్తితో ఇప్పుడు వారి ప్రాణాలే కాదు.. వారి ద్వారా చాలా మందికి కరోనా అంటి రిస్క్ లో పడ్డారు.  వైద్య ఆరోగ్యశాఖ ఎంత హెచ్చరిస్తున్నా కొందరు ఆర్ ఎంపీలు మాత్రం ఇష్టారాజ్యంగా తమ దగ్గరకు వచ్చిన వారికి వైద్యం చేస్తూ కరోనా వాహకాలుగా మారారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు కరోనా రోగులకు వైద్యం చేసి తద్వారా చాలా మందికి ఈ ఆర్ ఎంపీలు కరోనాను అంటించిన వైనం విస్తుగొలుపుతోంది. కత్తిపూడి ఉపాధ్యాయుడు - రాజమండ్రికి కర్నూలు నుంచి వచ్చిన యువకుడికి రహస్యంగా ఆర్ ఎంపీలు వైద్యం చేశారు. వీరికి కరోనా ఉండడంతో వీరి ద్వారా ఏకంగా 13మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడం తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది.

గ్రామాల్లో జ్వరం - దగ్గు - జలుబు సహా కరోనా లక్షణాలున్నవారికి వైద్యం చేయవద్దని ఆర్ ఎంపీలకు వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అయితే అన్ని ఆసుపత్రులు బంద్ అయిన వేళ ఆర్ ఎంపీలు కాసుల కక్కుర్తిలో పడి వైద్యం చేయడం ఆరంభించారు. ఇదే కరోనా వ్యాప్తికి కారణమైంది.

కత్తిపూడి ఉపాధ్యాయుడికి కరోనా వచ్చినా ఆర్ ఎంపీ వద్దకు వెళ్లి వైద్యం చేసుకున్నాడు. అతడి ద్వారా ఆర్ ఎంపీతో సహా నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఇక మరో ఘటనలో రాజమండ్రిలో మరో ఆర్ ఎంపీ కర్నూలులో మత సమావేశానికి హాజరై వచ్చిన యువకుడికి రహస్యంగా చికిత్స చేశాడు.  దీంతో ఆ 45 ఏళ్ల ఆర్ ఎంపీ సహా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. ఈ ఆర్ ఎంపీ ఈ మధ్యలో రోజుకు 60 మందికి వైద్యం అంటించాడు.. ఆర్ ఎంపీని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఎస్ ఐ - ఏఎస్ ఐ కూడా ఇప్పుడు ఐసోలేషన్ లోకి వెళ్లారు. దీంతో ఇంకా ఎంతమందికి కరోనా వ్యాపిస్తుందనేది ఆందోళనగా మారింది.

ప్రస్తుతం 80మందిని వీరికి సమీపంగా ఉన్న వారిని గుర్తించి కరోనా టెస్టులు చేశారు.  ఎంతమందికి బయటపడుతుందనే భయం గొలుపుతోంది.కాగా ఇద్దరు ఆర్ ఎంపీలపై పోలీసులు 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఆర్ ఎంపీల వైద్యాన్ని తూర్పుగోదావరి జిల్లాలో నిషేధించారు.


Tags:    

Similar News