విజయసాయి టెన్షన్ తీర్చిన కోర్టు.. ఫారిన్ టూర్ కు ఓకే

Update: 2021-08-27 03:35 GMT
వైసీపీ కీలక నేత.. రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు ఉన్న కోర్టు అడ్డంకి తొలగినట్లే. తాజాగా ఆయనకు సీబీఐ కోర్టు నుంచి ఉపశమనం లభించింది. తాజాగా ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న ఆయన..తన విదేశీ పర్యటన కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. షెడ్యూల్ లో భాగంగా ఆయన దుబాయ్.. బాలి.. మల్దీవులకు వెళ్లాల్సి ఉంది.

తీర ప్రాంతం డెవలప్ మెంట్ మీద అధ్యయనం చేసేందుకు ఆయన కోర్టుకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం కోర్టు అనుమతి అవసరమైంది. దీంతో.. సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణ గురువారం జరిగింది. గురువారం కాస్త పొద్దుపెయిన తర్వాత కోర్టు తన ఆదేశాల్ని జారీ చేసింది. కొన్ని పరిమితులకు లోబడి విజయసాయి విదేశీ పర్యటనకు ఓకే చెప్పేసింది.

రూ.5లక్షల చొప్పున ఇద్దరు పూచీకత్తుల్ని ఇవ్వటం ద్వారా విదేశీ పర్యటనకు అవసరమై అనుమతుల్నిపొందొచ్చని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. అక్టోబరు లోపు రెండు వారాల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు విజయసాయికి అవకాశం లభించనుంది.గురువారం రాత్రి వేళలో వచ్చిన తాజా ఆదేశాల నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు మార్గం సుగమం అయినట్లే.

ఇదిలా ఉంటే..  విదేశీ పర్యటనకు ఓకే అన్న ఆదేశాలకు ముందు విజయసాయి తన ట్విటర్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్లు ఆసక్తికరంగానే కాదు హాట్ టాపిక్ గా మారాయి. కొత్త చర్చకు తెర తీసేలా ఉన్న ఈ ట్వీట్ల సారాన్ని చూస్తే.. లిటిగేషన్‌కు వెళ్లాలంటే ఏ స్థాయి లాయర్లను పెట్టుకోవాలి..? ఎంత ఫీజుకు సిద్ధపడాలి..? అని కక్షిదారులు ఆలోచిస్తారు. గంటకు కోటి తీసుకునే ప్లీడర్‌ను నియమించుకోవడం ఒక ఎత్తయితే కోవర్టుకు కక్షిదారు వేషం వేసి లక్షల యూరోలు చెల్లించడం నయా శకుని చంద్రానికే చెల్లింది’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ అందరిని ఆకర్షించటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసిందన్న మాట వినిపిస్తోంది
Tags:    

Similar News