తాజాగా దేశ అత్యున్యతమైన న్యాయస్థానం ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు గురువారం నేర చరిత్ర కలవారు ఎన్నికల్లో పోటీ చేయడంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపి, ఇందులో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలన్నీ తమ తమ అభ్యర్థుల పై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ప్రచారంలోకి తీసుకురావాలని , అలాగే అందరికి కనిపించేలా అధికారిక వెబ్ సైట్లలో, సోషల్ మీడియాల్లో ఉంచాలని అన్ని పార్టీలకి ఆదేశాలు జారీచేసింది.
అయితే , ఇదే తరహా తీర్పు గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ అమలులోకి రాలేదు. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులున్నవారిని అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారు? నేర చరిత్ర లేనివారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదు?.. అనే కారణాలను రాజకీయ పార్టీలు బయటపెట్టాలని మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేర చరిత్ర కలిగిన ఉన్న వారిని తమ పార్టీ అభ్యర్థిగా ఎందుకు ఎంపిక చేశారో చెప్పేటప్పుడు కేవలం విజయావకాశాలే కాకుండా… వారి విద్యార్హతలు, సాధించిన విజయాలు, ప్రతిభ ప్రస్తావన తప్పకుండా ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించంది. ఇదే సమయంలో రోజు రోజుకి ఎన్నికలలో పోటీ చేసే నేరచరితుల సంఖ్య పెరిగిపోతోందని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కూడా నిజమే. ప్రస్తుతం చట్ట సభల్లో ఉన్నవారు సగం మందికి పైగా నేర చరిత్ర కలిగి ఉన్నవారే కావడం విశేషం.
అయితే , తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుని ఒకసారి పరిశీలిస్తే ... ఒక అభ్యర్థికి ఓటు వేసే ముందు , వారి నేర చరిత్ర గురించి కూడా వారికీ తెలిస్తే , ఎవరికీ ఓటు వేయాలనే విషయం బాగా అలోచించి తీసుకుంటారు అని సుప్రీం అభిప్రాయం. అందుకే సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చినట్టు అర్థమౌతుంది. ఇకపోతే ,ప్రస్తుతం దేశంలో అభ్యర్థి నేరచరిచుడు, అవినీతి పరుడు అని స్పష్టంగా తెలస్తున్నా కూడా పార్టీలు వారికే టికెట్స్ ఇస్తున్నారు , ప్రజలు కూడా వారికే ఓట్లు వేస్తున్నారు. దీనితో నేర చరితులు చట్ట సభలకు సులువుగానే వస్తున్నారు. అలా వచ్చిన వారు తాము ప్రజాకోర్టులో గెలిచామని..ఇతర న్యాయస్థానాలతో తమకు పనేమిటన్నట్లుగా ఇష్టా రీతిన ప్రవర్తిస్తున్నారు. చూడాలి మరి డబ్బుకి ఓటుని అమ్ముకోకుండా . అభ్యర్థి నేర చరిత్రని పరిశీలించి ఎంతమంది వచ్చే రోజుల్లో ఓట్లు వేస్తారో ...