వైసీపీలో మరో సీనియర్ నేత చేరిక దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఓ వెలుగు వెలిగి...అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. వైసీపీలో ఉన్న సమయంలో ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినప్పటికీ, పలు కారణాల వల్ల దాడి వీరభద్రరావు బయటకు వచ్చేశారు. తిరిగి వైసీపీ గూటికే ఆయన చేరనున్నట్లు చెప్తున్నారు. ఇందుకు తాజా పరిణామాలను ఉదాహరణగా పేర్కొంటున్నారు.
దాడి వీరభ్రరావు దాదాపు నాలుగేళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఒక దశలో ఆయన తిరిగి తెలుగుదేశం, వైసీపీలోకి వెళ్లాలనుకున్నా, అనివార్య కారణాల వలన అది సాధ్య కాలేదు. అయితే, ఆయన తాజాగా వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ, శాశ్వత మిత్రుత్వం కానీ ఉండదంటారు. దాడి వీరభద్రరావు రాజకీయాల్లో ఇంకా కొనసాగాలనుకున్నా, లేక ఆయన కుమారుడు రత్నాకర్‌ను రాజకీయ ఊతం ఇవ్వాలన్నా, దాడి మళ్లీ ఏ పార్టీలోనైనా చేరాల్సిన అవసరం ఉంది. అది ఏది అన్నది త్వరలోనే తేలేట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న దాడి వీరభద్రరావు ఈ మేరకు వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొద్దికాలం కిందట దాడి జనసేన వైపు చూసినప్పటికీ, ఈ చేరిక ఆగిపోయింది. దీంతో త్వరలోనే ఆయన వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.
తాజాగా,అనకాపల్లిలో మద్దతుదారులతో దాడి భేటీ అయ్యారు. వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్న వీరభద్రరావు ఈ సందర్భంగా మద్దతుదారుల అభిప్రాయాలు సేకరించారు. పార్టీలో చేరాలని వైసీపీ నేతలు కోరుతున్నారని, 10 రోజుల్లో క్లారిటీ ఇస్తానని పేర్కొన్నట్లు సమాచారం. కాగా, వైసీపీలో చేరేందుకు దాడి వీరభద్రరావు రెడీ అయినట్లు తెలుస్తోంది.