ఆ మధ్యన ఏపీ సర్కారును ఉరుకులు పరుగులు పెట్టించిన గరగపర్రు తాజాగా మరోసారి రగిలింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని గరగపర్రులో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సంగతి తెలిసిందే. విగ్రహం విషయంలో ఏర్పడిన వివాదం అంతకంతకూ ముదిరి.. చివరకు సామాజిక బహిష్కరణ వరకూ వెళ్లటం.. ఆ వ్యవహారం బయటకు రావటం తెలిసిందే.
ఈ వ్యవహారాన్ని సరైన సమయంలో సరిగా గుర్తించక.. ఇష్యూ పెద్దది కావటానికి కారణమైందన్న విమర్శ ఏపీ సర్కారు మీద ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా తమ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించటం లేదంటూ గ్రామానికి చెందిన దళితులు గడిచిన 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
తాజాగా దీక్షలు చేస్తున్న వారికి మద్దతు తెలిపేందుకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేశ్ చలో గరగపర్రుకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం నేపథ్యంలో తన అనుచరులతో కలిసి రాజేశ్ గరగపర్రులో పర్యటించే ప్రయత్నం చేశారు. రాజేశ్ పర్యటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందన్న అంచనాతో పోలీసులు ఆయన్ను.. ఆయన అనుచరులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాజేశ్ వర్గానికి.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల తీరుకు నిరసనగా గరగపర్రు దళితులు భారీ ర్యాలీని నిర్వహించారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా ముగ్గురు దళిత యువకులు దగ్గర్లోని డ్రెయిన్ లోకి దూకి తమ నిరసనను తెలిపారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర టెన్షన్‌కు తెర తీసింది. సున్నిత అంశాల విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.