జేసీ బ్రదర్స్ తీరే వేరు. జేసీ దివాకర్ రెడ్డి మాటలతో సంచలనాలు సృష్టిస్తే.. ఆయన సోదరుడు కమ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేతలతో సంచలనాలు సృష్టిస్తుంటారు. ఆయన కానీ ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు.. రచ్చ రచ్చే. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఫైర్ అవుతారో ఊహించటం కాస్త కష్టమే. అది ఆయనుండే తాడిపత్రి అయినా.. హైదరాబాద్ అయినా ఒక్కటే. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లోనూ తన తీరును ప్రదర్శించిన జేసీ.. తర్వాతి కాలంలో తన హడావుడిని అనంతపురం జిల్లాకు పరిమితం చేశారు.
తాజాగా ఆయన అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న మీద తిట్ల వర్షం కురిపించటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ మేయర్ పై జేసీ బ్రదర్ చిందులపై దళిత సంఘాలు ఫైర్ కావటమే కాదు.. ఆయనపై ఎస్సీ..ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో దళిత సంఘాలుభారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. మామూలుగా అయితే.. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికైనా ఎదురైతే వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది. కానీ.. జరుగుతున్న రచ్చ మొత్తం జేసీ ప్రభాకర్ కావటంతో పోలీసులు సైతం ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాడిపత్రి కల్చర్ ను అనంతపురానికి తీసుకొస్తే సహించేది లేదని. ఏదైనా ఉంటే ఆయన అడ్డాలోనే చేసుకోవాలి తప్ప.. తమ మీద ప్రదర్శిస్తే బాగోదంటూ గంపన్న వర్గం మండిపడుతోంది. మరి.. వారు డిమాండ్ చేస్తున్నట్లుగా జేసీ బ్రదర్ మీద కేసు.. అరెస్ట్ లాంటివి అనంత పోలీసులు చేస్తారా..?