ఓ వ్యాపార అవకాశంగా కరోనా మృతుల అంత్యక్రియలు!

Update: 2020-07-18 02:30 GMT
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర , తమిళనాడు , ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. అలాగే కరోనా భారిన పడి మరణించే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. కరోనా భారిన పడి చనిపోతే , వారి అంత్యక్రియలకు కూడా వారి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరుకాలేని పరిస్థితి. దీనితో చలా రాష్ట్రాల్లో  మున్సిపాలిటీ సిబ్బందే కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కానీ, మృతదేహాలు పూర్తిగా కాలిపోవడం లేదని..శ్మశానంలో పూర్తి కాలని మృతదేహాలని కుక్కలు పీక్కుతింటున్నాయనే వార్తలు కూడా కొన్నిచోట్ల  వినిపిస్తున్నాయి.  

ఈ విధమైన సమస్యన పరిష్కరించడానికి కొన్ని ఏజెన్సీలు ముందుకువచ్చాయి. కరోనా తో ఎవరైనా చనిపోతే.. వారి కుటుంబీకులకు ఫోన్ చేస్తున్నారు. సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేస్తామని , దానికోసం రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. మాములుగా అయితే , హాస్పిటల్ నుంచి డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లడానికే చాలా మంది అంబులెన్స్ నిర్వహాకులు ఇంతకంటే ఎక్కువే వసూలు చేస్తున్నారు. కరోనా నిబంధనాలు పక్కాగా పాటిస్తూ .. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేసి  చితాభస్మాన్ని అనుమతిస్తున్నారు. అలాగే వారు శ్మశానంలోకి రావాలనుకునే వారు కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాల్సిందే.  దానికోసం ఒక్కో కిట్‌ కు రూ.1200 చొప్పున చెల్లించాలి. కరోనా సమయంలో ఇదొక మంచి వ్యాపార అవకాశం  అని చెప్పవచ్చు. అయితే , చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News