కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ వల్లకాడును తలపిస్తున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకపోవటం తర్వాత.. చచ్చిపోయిన శవాలకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు శశ్మనాలు ఫుల్ అయిపోయి.. వెయిటింగ్ లిస్టు పెట్టుకునే దుస్థితికి వెళ్లిన వైనం గుండెల్ని పిండేస్తోంది. ఇంత జరుగుతున్నా.. మరణాలన్ని కొవిడ్ మరణాలు కావన్న టెక్నికల్ పాయింట్ ఒకటి చూపించి.. ప్రభుత్వాలు ఆడుతున్న ఆటలు.. సామాన్యుల కంట తడి పెట్టిస్తున్నాయి. యావత్ దేశంలో ఇప్పుడో ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. ఇంతకు ముందెప్పడు ఎదుర్కొని కష్టకాలాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎంత డబ్బు అయినా ఇస్తాం.. ఆసుపత్రిలో బెడ్ కావాలన్న రిక్వెస్టును.. ఆసుపత్రులు ఏం చేయలేక చేతులెత్తేస్తున్నాయి.
డబ్బున్న వారు పలువురు.. పలుకుబడి ఉన్న వారు ఇంకొందరు.. ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ కరోనా కాటుకు బలైపోతున్నారు. నిన్నటివరకు బాగానే ఉన్న వారు.. అప్పటివరకు నవ్వుతూ ఫోన్లో మాట్లాడిన వారు.. మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి బయటపడిపోతామన్న ధీమాను ప్రదర్శించిన వారు.. గంటల వ్యవధిలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. అంతులేని ఆవేదనను మిగులుస్తున్నారు. ఇంతకూ ఏం జరుగుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇప్పటివరకు కరోనా మరణాల మీద పోస్టు మార్టం కానీ.. మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అన్న దాని మీద పరిశోధన ఇప్పటివరకు చేస్తున్నది లేదు. ఆ మాటకు వస్తే.. బెడ్డు దొరకాలంటే.. ఎవరో ఒకరి ప్రాణం గాల్లో కలిసి పోవాలన్న మాటను ఆసుపత్రి సిబ్బందే చెబుతున్నారు. అలా అని వారిని దోషులుగా ఎత్తి చూపటం మా ఉద్దేశం కాదు. ఆసుపత్రుల మీద ఉన్న ఒత్తిడి అంత ఎక్కువగా ఉంది. అక్కడ పని చేసే సిబ్బంది కూడా మానవ మాత్రులే కదా? వైరస్ ఏ మూల నుంచి ఎలా దాడి చేస్తుందో తెలీని వేళ.. విధి నిర్వహణ చేస్తున్న వైద్య.. వైద్యేతర సిబ్బంది తెగువ అనేది లేకుండా.. ఈ రోజు పరిస్థితిని కనీసం ఊహించటానికి కూడా ధైర్యం చాలదు.
మరి.. అప్పటివరకు ఆరోగ్యం ఉన్న వారు.. అంతలోనే సీరియస్ కావటం.. మరణించటం కారణం ఏమిటి? రెండు రోజుల వ్యవధిలోనే పరిస్థితి అంతలా ఎందుకు చేజారిపోతోంది? అది కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పుడు? అన్న ప్రశ్నలు ఇప్పుడు పలువురిని వేధిస్తున్నాయి. ఆరోగ్య జీవితాన్ని అమలు చేస్తున్న వారు కరోనా బారిన పడి.. వారి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారి.. ఆసుపత్రిలో చేరి కోలుకుంటున్న వారి అకస్మాత్తు మరణాల మీద పరిశోధకులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే.. మరిన్ని ప్రాణాల్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకునే వీలుంది. మరి.. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించే పరిస్థితి ఇప్పటికైతే ఉందంటారా?