కరోనా రావటమే పెద్ద సమస్య అనుకుంటే.. దాన్ని జయించిన తర్వాత మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ మాటకు వస్తే కరోనాతో ఒకలాంటి సమస్యల్ని ఎదుర్కొంటే.. చికిత్స అనంతరం కోలుకున్నారన్న సంబరం కంటే కూడా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీనికి తగ్గట్లే ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్ పేరుతో విరుచుకుపడుతున్న కొత్త రోగాలతో కరోనా నుంచి బయటపడిన వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇది సరిపోదన్నట్లుగా తాజాగా మరో కొత్త లక్షణం కరోనాను అధిగమించిన తర్వాత బయటకు వస్తోంది. పోస్ట్ కోవిడ్ లో శరీరంలో వచ్చే మార్పుల్ని జాగ్రత్తగా పరిశీలించి వెంటనే వైద్యం చేయించుకోవాలని చెబుతున్నారు. గుజరాత్ లో కరోనా నుంచి కోలుకున్న రోగికి తాజాగా గ్యాంగ్రీన్ లక్షణాలు కనిపించాయి. మరికొందరు రోగుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని చెబుతున్నారు.
కరోనా బారిన పడిన రోగులకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రక్తం చిక్కపడటం.. షుగర్ లెవెల్స్ భారీగా పెరగటం.. ఆకస్మిక గుండెపోటు ఇలా ఎన్నో సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయి. చాలామందిలో కరోనా నుంచి బయటపడిన తర్వాత రక్తం చిక్కబడటం.. తిరిగి సాధారణ స్థితికి రావటం కనిపిస్తోంది. అయితే.. ఇదే ప్రక్రియ పదేపదే చోటు చేసుకోవటంతో కొందరిలో రక్తం గడ్డ కట్టుకుపోయి త్రోంబోసిస్ కు దారి తీస్తుంది.
రక్తం గడ్డకట్టిన భాగాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కాళ్లు.. చేతుల్లో రక్తం గడ్డలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే.. అది క్రమంగా గ్యాంగ్రీన్ కు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాళ్లు.. చేతులు రక్తపు గడ్డలు కట్టి మొద్దుబారిపోయినట్లుగా కానీ బరువుగా కానీ అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని కోరుతున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ ఎర్ర గడ్డలు నీలం రంగులోకి మారిపోతాయి. సరైన సమయంలో వైద్య సాయం అందకపోతే.. ప్రాణాల మీదకు వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. కరోనా నుంచి జయించామన్న సంబంరం కంటే కూడా.. ఆ తర్వాతే ముప్పు ఎక్కువన్న విషయాన్ని గుర్తించటం చాలా ముఖ్యమని చెబుతున్నారు.