చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యాధికారులు చెబుతున్నారు. నిజమే.. వారు చెప్పిందే నిజం అనుకుందాం. మీడియా చేస్తున్నదే తప్పని అనుకుందాం.అలాంటప్పుడు కొన్ని వాస్తవాల గురించి సమాచారం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
మాయదారిరోగం మొదలై దాదాపు రెండున్నర నెల దాటుతోంది. ఏదైనా ఒక కొత్త పని వెంటనే అలవాటు కావటం కష్టమే. అలా అని రెండున్నర నెలల సమయం తీసుకోవటం కూడా తప్పే అవుతుంది. మిగిలినరాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజుకు ఆ రోజు కేసులకు సంబంధించిన బులిటెన్ ఏటైం అన్నది లేకుండా ఎందుకు విడుదల చేస్తున్నట్లు?
ఎక్కడ వరకో ఎందుకు? పక్కనే ఉన్న ఏపీలోనే చూస్తే.. హెల్త్ బులిటెన్ ను ఉదయం.. సాయంత్రం అంటూ రెండుసార్లు..కొన్నిసార్లు అయితే మూడు సార్లు కూడా విడుదల చేస్తున్నారు. కానీ.. తెలంగాణ లో మాత్రం రోజుకు ఒకసారి.. అది కూడా రెండు పేజీల సమాచారం. వాటిల్లో కూడా మొదటి పేజీలోని.. అంకెల మార్పుతప్పించి మరింకేమీ చెప్పని పరిస్థితి. ఎక్కడి దాకానో ఎందుకు? రోజు వారీగా ప్రకటించే మరణాల్లో .. పురుషులు ఎంతమంది? మహిళలు ఎంతమంది? వారి వివరాలు.. వారు ఎలా చనిపోయారు? లాంటి వివరాల్ని ఎందుకు ఇవ్వరన్నది ప్రశ్న.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక టైం అన్నది లేకుండా హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు. సోమవారం విషయానికే వస్తే.. రాత్రి పది గంటల తర్వాత విడుదల చేయటం దేనికి నిదర్శనం? అంత రాత్రి వరకూ వెయిట్ చేయించాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. సోమవారం 92 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని.. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3742గా తేల్చారు. మరణాల సంఖ్య 142కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్న 393 మందిని గాంధీ నుంచి డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కొద్దిపాటి వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేయటానికి రాత్రి పది గంటల వరకు అవసరమా? అన్నది క్వశ్చన్. కావాలంటే రాత్రి ఏడు గంటలకు కటాఫ్ టైం పెట్టుకొని.. రాత్రి 7 గంటల సమయానికి ఇన్ని కేసులు వచ్చాయి? ఎన్ని మరణాలుచోటు చేసుకున్నాయి? లాంటి వివరాల్ని ఇచ్చేస్తే టైంకు రిలీజ్ చేసినట్లుఉంటుంది. ఆ టైంకు ఎంత సమాచారం ఇస్తామో.. అంతే రిపోర్టు అవుతుంది? మరీ.. చిన్న విషయాన్ని ఎందుకు మిస్ చేస్తున్నట్లు అన్నది అసలు ప్రశ్న. బులిటెన్ ఎప్పడు విడుదల అవుతుందో తెలీక మీడియా ప్రతినిధులకు కళ్లు కాయలు కాస్తున్నాయి.